
కాశీలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని ఈ ఫొటోలోని దివ్యాంగురాలు శిఖా రస్తోగి చాలా కష్టపడి వచ్చింది. మోడీని చూడగానే ఆశీర్వాదం తీసుకుందామని పాదాలకు నమస్కరించే ప్రయత్నం చేస్తుంటే.. మోడీ ఆమెను అడ్డుకుని, తనే ఆమె పాదాలకు నమస్కరించారు. కారిడార్ ప్రారంభోత్సవంలో కనిపించిన దృశ్యమిది. బీజేపీ లీడర్ వనతీ శ్రీనివాసన్ ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘మహిళా శక్తికి దక్కిన గౌరవం. ప్రధాని మోడీ మనందరికీ గర్వకారణం’ అని ట్వీట్ చేశారు.