మోడీ కేబినెట్ విస్తరణ.. ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది

మోడీ కేబినెట్ విస్తరణ..  ప్రమాణ స్వీకారం చేసిన 43 మంది

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక తన కేబినెట్‌లో తొలిసారి భారీ మార్పులు చేశారు. కేంద్ర కేబినెట్‌ విస్తరణలో భాగంగా  కొత్త 36 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న ఏడుగురికి వారి పనితీరు ఆధారంగా పదోన్నతి కల్పించారు. దీంతో మొత్తంగా 43 మంది బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేబినెట్‌లో పలువురి శాఖల్లో మార్పులు జరగున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రులు, సహాయ శాఖ మంత్రులుగా ఉన్న రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్, రమేశ్ పోక్రియాల్, ప్రకాశ్ జవదేకర్, సంతోశ్ కుమార్ గంగ్వార్, సదానంద గౌడ, థావర్ చంద్ గెహ్లాట్, సంజయ్ శ్యామ్ రావు, ప్రతాప్ చంద్ర సారంగి, దేవ శ్రీ చౌదరి, బాబుల్ సుప్రియో, సంజయ్ ధోతరే, రతన్ లాల్ కటారియా, ధన్వే పాటిల్, అశ్వినీ చౌబే వంటి వారికి మోడీ ఉద్వాసన పలికారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారితో కలిపి మోడీ కేబినెట్‌లో మొత్తం మంత్రుల సంఖ్య 77కి చేరింది.

43 మంది లిస్ట్

 జి. కిషన్ రెడ్డి 
 హర్దీప్ సింగ్ పూరి
 మన్సుఖ్ మాండవీయ
 పురుషోత్తం  రూపాలా
 అనురాగ్ సింగ్ ఠాకూర్
 కిరెన్ రిజిజు
 నారాయణ్​ రాణే
 సర్బానంద సోనోవాల్
డాక్టర్ వీరేంద్ర కుమార్
 జ్యోతిరాదిత్య సింధియా
 రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్
 అశ్విని వైష్ణవ్
 పశుపతి పరాస్
 రాజ్ కుమార్ సింగ్
పంకజ్ చౌదరి
 అనుప్రియా సింగ్ పటేల్
 డాక్టర్ సత్య పాల్ సింగ్ 
 రాజీవ్ చంద్రశేఖర్
 శోభా కరండ్లజే
 భాను ప్రతాప్ సింగ్ వర్మ
 దర్శన విక్రమ్ జర్దోష్
 మీనాక్షి లేకి
 అన్నపూర్ణ దేవి
 ఎ. నారాయణస్వామి
 కౌషల్ కిషోర్
 అజయ్ భట్
 బి. ఎల్. వర్మ
 అజయ్ కుమార్
 చౌహన్ దేవ్‌సిన్హ్
 భగవంత్ కుభా
 కపిల్ మోరేశ్వర్ పాటిల్
 ప్రతిమా భౌమిక్
 డాక్టర్ సుభాష్ సర్కార్
 డాక్టర్ భగవత్ కిషన్ రావ్ కరాడ్
 డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్
 డాక్టర్ భారతి ప్రవీణ పవార్
 బిశ్వేశ్వర్ తుడు
 శాంతను ఠాకూర్
డాక్టర్ ముంజపరా మహేంద్ర భాయ్
 జాన్ బార్లా
 డాక్టర్ ఎల్.మురుగన్
నిషిత్ ప్రమాణిక్
 భూపేందర్ యాదవ్