రైతులకు మోడీ దీపావళి కానుక: రబీ పంటలకు మద్దతు ధర పెంపు

రైతులకు మోడీ దీపావళి కానుక: రబీ పంటలకు మద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ: దీపావళి ముందు మోడీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రి మండలి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. రబీ పంటకు కనీస మద్దతు ధరను 50 శాతం నుంచి 109 శాతం వరకు పెంచామని చెప్పారాయన.

కేబినెట్ కీలక నిర్ణయాలివే:

  • రబీ పంటలైన గోధుమ, శనగ పప్పు, కంది పప్పు, ఆవాలకు మద్దతు ధర పెంపు.
  • ప్రస్తుతం క్వింటా గోధుమకు రూ.1840 ఉన్న మద్దతు ధర రూ.1925కు పెంపు
  • క్వింటా బార్లీకి రూ.1440 నుంచి 1525కు, పచ్చిశనగలకు రూ.4620 నుంచి రూ.4875కు, కందిపప్పుకు రూ.4475 నుంచి రూ.4800కు, ఆవాల ధరను రూ.4200 నుంచి రూ.4425కు పెంచింది కేంద్రం.
  • ఢిల్లీలో అనుమతుల్లేని 40 లక్షల ఇళ్లను క్రమబద్ధీకరిస్తూ ఆ ఇళ్లలో ఉంటున్న వారికే ఓనర్ షిప్ అందజేత.
  • పెట్రోలియం, డీజిల్ రిటైల్ (బంకులు, అమ్మకాలు) మార్కెట్ రంగంలోకి కొత్త కంపెనీలకు, ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి.
  • బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్.. రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థల విలీనం. ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఎస్ఎన్ఎల్ కింద ఎంటీఎన్ఎల్ పని చేసేలా చర్యలు. 2016 రేట్లతో 4జీ స్పెక్ట్రం ఇవ్వాలని నిర్ణయం.
  • కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) ప్యాకేజీల కోసం రూ.29,937 కోట్ల కేటాయింపు.