ట్విట్టర్​ ఫ్రొఫైల్​ పిక్చర్ మార్చిన మోడీ

ట్విట్టర్​ ఫ్రొఫైల్​ పిక్చర్ మార్చిన మోడీ
  • నోటికి కండువా చుట్టుకున్న ఫొటో పెట్టిన ప్రధాని
  • మాస్క్​ల వాడకంపై జనంలో అవగాహన పెంచేందుకే

న్యూఢిల్లీ: ట్విట్టర్​లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రొఫైల్​ పిక్చర్​ ​ మారింది. లాక్​ డౌన్​ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్టు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. కొద్దిసేపటి తర్వాత తన ట్విట్టర్​ అకౌంట్​ ప్రొఫైల పిక్చర్​ను మార్చారు. నోటికి, ముక్కుకు కాటన్​ కండువాను చుట్టుకున్న ఫొటోలను తన బయోపిక్​గా ఆయన పెట్టారు. ఈ రోజు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు తీసిన ఫొటో ఇది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మాస్క్​ల అవసరంపై అవగాహన పెంచేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో తయారు చేసిన మాస్క్​లను మాత్రమే వాడాలని ప్రజల్లో ఎవేర్​నెస్​ తీసుకొచ్చే ఉద్దేశంతోనే మోడీ తన బయోపిక్​ను మార్చినట్టుగా తెలుస్తోంది. డాక్టర్లు, మెడికల్​ సిబ్బందికి మాత్రమే మాస్క్​లు అని, సాధారణ జనాలు ఇంట్లో చేసిన మాస్క్​లు, కండువాలు వాడాలని కొద్ది రోజుల క్రితం మోడీ కోరారు. శనివారం సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో కూడా ప్రధాని ఇంట్లో తయారు చేసిన మాస్క్​నే పెట్టుకున్నారు.