‘మోడీ’ సామాజిక వర్గాన్ని రాహుల్ కించపరిచారు: పీఎం మోడీ

‘మోడీ’ సామాజిక వర్గాన్ని రాహుల్ కించపరిచారు: పీఎం మోడీ

‘మోడీ’ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కించపరిచారని ప్రధాని మోడీ అన్నారు. బుధవారం మహారాష్ట్ర సోలాపూర్, అక్లుజ్ లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మోడీ… ఇప్పటివరకు..రాహుల్, ఆయన పార్టీ వాళ్లు తనను కించపరిచే విధంగా మట్లాడారని… అయితే ఈసారి మాత్రం రాహుల్ మరో అడుగు ముందుకేసి ‘మోడీ’ సామాజిక వర్గ ప్రజలందరూ దొంగలు అనేవిదంగా మాట్లాడారని చెప్పారు. ఒక సామాజిక వర్గం పై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పటికే లిమిట్స్ అన్నింటినీ క్రాస్ చేసిందని ఇలాంటి పరిణామం మంచిది కాదని అన్నారు ప్రధాని మోడీ.

మహారాష్ట్ర లోని నాందేడ్ లోక్ సభ స్థానంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మాట్లడిన రాహుల్ గాందీ మోడీ ఇంటిపేరు ఉన్నవారందరూ దొంగల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇందుకు.. లలిత్ మోడీ, నీరవ్ మోడీ లను ఉదహరించారు.