రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం : అమిత్ షా

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం :  అమిత్ షా

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌‌‌‌ షా అన్నారు. ప్రత్యేకంగా రైతుల కోసం తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్‌‌‌‌ సమ్మాన్‌‌‌‌ నిధి’కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పైగా నిధులను వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌లో భాగంగా 16వ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కింద రూ.21 వేల కోట్లకు పైగా నిధులను జమ చేయనున్నామని బుధవారం ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ (డీబీటీ) ద్వారా అందిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపుల స్కీమ్‌‌‌‌ ఇదేనని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు.