గుడ్ న్యూస్ : గ్యాస్ సబ్సిడీ రూ.100 పెంచిన కేంద్రం

గుడ్ న్యూస్ : గ్యాస్ సబ్సిడీ రూ.100 పెంచిన కేంద్రం

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న వినియోగదారులకు శుభవార్త. ఇప్పటి వరకు వస్తున్న 200 రూపాయల సబ్సిడీని.. 300 రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 2023, అక్టోబర్ 4వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్. 

ప్రస్తుతం మార్కెట్ లో 903 రూపాయలు ఉన్న 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ను.. ఉజ్వల్ యోజన వినియోగదారులకు 703 రూపాయలకే అందజేస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వంద రూపాయల సబ్సిడీతో.. ఇక నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్.. ఈ కస్టమర్లకు 603 రూపాయలకే అందుబాటులోకి రానుంది.

Also Read : మహదేవ్ యాప్ స్కామ్లో టాప్ హీరోకు ఈడీ నోటీసులు

మొన్నటికి మొన్న గ్యాస్ సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించిన కేంద్రం.. ఇప్పుడు ఉజ్వల్ కస్టమర్లకు అందజేస్తున్న సబ్సిడీని మరో వంద రూపాయలు పెంచటం ద్వారా.. పేద, మధ్య తరగతి కుటుంబాలకు కొంచెం భారం తగ్గినట్లే. దేశంలో మొత్తం 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం అందనుంది. పెంచిన సబ్సిడీ.. వెంటనే అమల్లోకి వస్తున్నట్లు కూడా ప్రకటించారు కేంద్ర మంత్రి.