రాష్ట్రానికి ₹1,026 కోట్లు: రిలీజ్ చేసిన కేంద్రం

రాష్ట్రానికి ₹1,026 కోట్లు: రిలీజ్ చేసిన కేంద్రం

జీఎస్టీ పరిహారం కింద రిలీజ్ చేసిన కేంద్రం 

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కింద రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం రూ.1,026 కోట్లను విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం కింద ఇవి రిలీజ్‌‌ అయ్యాయి. 14 శాతం లోపు ఆదాయం ఉన్న రాష్ట్రాలకు పరిహారం ఇస్తారు. గత రెండు నెలలుగా కేంద్రం నుంచి జీఎస్టీ డబ్బులు రావడం లేదు. ఇదే విషయమై సీఎం కేసీఆర్‌‌ ఇటీవల కేంద్రానికి  లేఖ రాశారు. రూ.4,531 కోట్లు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు సైతం పార్లమెంట్‌‌లో ప్రస్తావించారు. అంతేకాకుండా బుధవారం జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌‌ సమావేశంలో బీజేపీయేతర సభ్యులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం రూ.35,298 కోట్లు విడుదల చేసింది.

వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి