మోడీ ఉంటే అన్నీ సాధ్యమే.. రాహుల్ గాంధీ సెటైర్

మోడీ ఉంటే అన్నీ సాధ్యమే.. రాహుల్ గాంధీ సెటైర్

న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్‌‌, ప్రధాని మోడీ లక్ష్యంగా పదే పదే విమర్శలకు దిగుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోమారు మోడీని దుయ్యబట్టారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ జీడీపీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యంత అల్ప స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి రీసెంట్‌గా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ప్రధానిపై రాహుల్ మండిపడ్డారు.

2019 ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రచారం చేసిన మోడీ ఉంటే అన్నీ సాధ్యమే (మోడీ హే తో సబ్‌ మున్‌కిన్ హే) అనే నినాదాన్ని గుర్తు చేస్తూ చురకలు అంటించారు. దీనికి నారాయణ మూర్తి వ్యాఖ్యలను జోడిస్తూ ట్వీట్ చేశారు. ‘ఇండియా జీడీపీ 5% మేర కుంచించుకుపోయే ప్రమాదం ఉంది. గ్లోబల్ జీడీపీ 5 నుంచి 10 శాతం మేర కుదించుకుపోవొచ్చు’ అని రీసెంట్‌గా నారాయణ మూర్తి చెప్పారు. మూర్తి వ్యాఖ్యలకు సంబంధించిన ఆర్టికల్‌ను రాహుల్ షేర్ చేశారు.