జవాన్లు చనిపోతుంటే మీరేం చేశారు?

జవాన్లు చనిపోతుంటే మీరేం చేశారు?

ప్రధాని మోడీపై రాహుల్ సీరియస్
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తర దశకు చేరుకుంది. ఎన్డీయే కూటమి తరఫున ప్రధాని మోడీ, విపక్షాల నుంచి కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రచారానికి దిగడంతో బిహార్‌‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పడం ద్వారా యూపీఏ కూటమి బిహార్ అమరవీరులను అవమానిస్తోందంటూ మోడీ విమర్శించారు. దీనికి రాహుల్ స్పందించారు. బిహార్‌‌కు చెందిన అమర సైనికులు చనిపోతుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇండో-చైనా బార్డర్ వివాదం, వలస కూలీల బాధలను ప్రస్తావిస్తూ బీజేపీ సర్కార్‌‌పై రాహుల్ విరుచుకుపడ్డారు.

‘చైనా మన భూభాగంలోకి చొరబడినప్పుడు దాన్ని ప్రధాని మోడీ ఎందుకు ఖండించారు? ఇప్పుడు అమర జవాన్లు ముందు శిరస్సు వంచుతున్నానని మోడీ అంటున్నారు. మొదట్లో ఆయన ఎందుకు అబద్ధాలు చెప్పినట్లు? బిహారీలకు అబద్ధాలు చెప్పకండి మోడీ జీ. మీరు బిహారీలకు ఉద్యోగాలు ఇచ్చారా? గత ఎన్నికల్లో ప్రధాని 2 కోట్ల జాబ్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. రైతులు, ఆర్మీ, కూలీలతోపాటు వ్యాపారుల ముందు శిరస్సు వంచుతానని మోడీ అంటున్నారు. కానీ ఇంటికి చేరాక.. అంబానీ, అదానీ కోసమే ఆయన పని చేస్తారు. వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి వందలాది మైళ్లు నడుస్తున్నప్పుడు మోడీ ఏం చేశారు?’ అని రాహుల్ పేర్కొన్నారు.