ఒక్క క్లిక్తో భారత్, సింగపూర్ల మధ్య లావాదేవీలు

ఒక్క క్లిక్తో భారత్, సింగపూర్ల మధ్య లావాదేవీలు

యూపిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) మారడంతో త్వరలో రికార్డు స్థాయిలో డిజిటల్ లావాదేవీలు జరుగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందులో భాగంగా భారత్, సింగపూర్ ల మధ్య డిజిటల్ ట్రాన్ సాక్షన్స్ సులభం అయ్యేలా కనెక్షన్ ప్రాసెస్ ని తీసుకొచ్చారు. దీనికోసం మన దేశ యూపీఐ, సింగపూర్ కు చెందిన పే నౌలను ఇరు దేశాల ప్రధానులు ప్రారంభించారు. యూపీఐ, పే నౌలను కనెక్ట్ చేయడంవల్ల రెండు దేశాల వినియోగదారులు ఈజీగా డిజిటల్ ట్రాన్ సాక్షన్స్ చేసుకోవచ్చని ఆర్ బీఐ తెలిపింది. ఈ సర్వీస్ లను ప్రారంభించిన సంధర్భంగా మొదటి ట్రాన్ సాక్షన్ ని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ మానిటరీ అథారిటీ ఎండీ రవి మేనన్ లు చేశారు.