అయోధ్య ఆలయంలో.. మోదీ మహా యజ్ణం

అయోధ్య ఆలయంలో.. మోదీ మహా యజ్ణం

జనవరి 22న అయోధ్యలో జరిగే మహాయజ్ఞం లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని పండితులు లక్ష్మీకాంత్ దీక్షిత్ తెలిపారు.  ఇప్పటికే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించిన పూజలు ( జనవరి 16) ప్రారంభమయ్యాయి.  

వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ప్రధాన పూజలు నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్యలో అమృత్ మహోత్సవ్ జరగనుంది. 1008 కళశాలతో మహాయజ్ఞం నిర్వహించి వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. ఈ మహాయజ్ఞంలో  జనవరి 22న ప్రధాని మోదీ పాల్గోనున్నారు.  అయోధ్యకు తరలివచ్చే వేలాది మంది భక్తుల కోసం పలు టెంట్ సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 10 వేల నుంచి 15 వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి వస్తున్నవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడ్తున్నారు.

 ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వివరాలను.. మహాయజ్ఞానికి సంబంధించిన, వివరాలను కాశీ పండితుడు ...  పూజారి గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ 121 మంది ఆచార్యుల బృందంతో  పర్యవేక్షించనున్నారు. సమయానుకూలంగా ఆయన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను వివరించనున్నారు. అయితే ప్రాణ ప్రతిష్ఠకు అన్నికార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం లేనందున  పండిట్ లక్ష్మీకాంత్... మధురనాథ్ దీక్షిత్ లు అయోధ్యలో మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు.  జనవరి 22న జరిగే ముఖ్యమూన ఘట్టానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.