మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకులకు కలర్ వేస్తున్నరన్న వివేక్ వెంకటస్వామి

మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకులకు కలర్ వేస్తున్నరన్న  వివేక్ వెంకటస్వామి

దేశ ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలంటే ప్రధానిమోడీకే సాధ్యమని చెప్పారు. మిషన్ భగీరథ పేరుతో  పాత ట్యాంక్ లకు కలర్ వేసి రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారని, మరో రూ.30 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.5లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయలగూడెం గ్రామంలో పలువురు మునుగోడు ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి సమక్షంలో బీజేపీలో చేరారు. 

రుణమాఫీ లేదు, నిరుద్యోగ భృతి లేదు గానీ ప్రజలకు లబ్ధి పొందే స్కీమ్ లు కాకుండా కమీషన్లు వచ్చే వాటికే నిధులు కేటాయిస్తున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. కేసీఆర్ అభివృద్ధి చేసి కాదు.. డబ్బులిచ్చి ఓట్లు కొంటాననే అహంకారంతో  ఉన్నాడన్న వివేక్ వెంకటస్వామి... రాష్ట్రంలో ప్రజలు బాగోగులు మరిచి, 100 కోట్లతో హెలికాప్టర్ కొని రాష్ట్రాలు తిరుగుతాడంట అని కామెంట్ చేశారు. మునుగోడులో వందమంది కౌరవులను (ఎమ్మెల్యేలను) పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కౌరవులు టీఆర్ఎస్, బీజేపీ పాండవుల మధ్య పోటీ జరుగుతుందని చెప్పుకొచ్చారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని, ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

రేపు చౌటుప్పల్ కు కేంద్ర మంత్రి భూపేందర్ యదవ్...

ఉదయం 10.30  గంటలకు చౌటుప్పల్ లోని పీబీ గార్డెన్ లో జరిగే  సభకు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా యాదవులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. నర్సాపూర్ లో జరిగే సభకు వెళ్లే ముందు మునుగోడు సభలో కేంద్ర మంత్రి పాల్గొంటారని తెలిపారు.