నేతాజీ వంటి మహోన్నత వ్యక్తిని కన్న నేలకు వందనాలు

నేతాజీ వంటి మహోన్నత వ్యక్తిని కన్న నేలకు వందనాలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రేరణతోనే భారత్ ముందుకు సాగుతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కోల్ కతాలో నిర్వహించిన సుభాష్ చంద్రబోస్ 125 జయంతి వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. ప్రతీ భారతీయుడు నేతాజీకి రుణపడి ఉంటాడన్నారు. దేశానికి బెంగాల్ ఎంతో అమూల్యమైన సంపదనిచ్చిందన్నారు. మన దేశానికి జాతీయ గీతాన్ని అందించింది కూడా ఈ భూమేనన్నారు. నేతాజీ లాంటి మహోన్నత వ్యక్తిని కన్న ఈ నేలకు వందనాలు చేస్తున్నానన్నారు. ఈ ఏడాది దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతోందన్నారు మోడీ. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పంతో పనిచేస్తోన్న ఈ టైమ్ లో నేతాజీ జీవితం, ఆయన చేసిన పనులను మనకు స్పూర్తినిస్తాయన్నారు మోడీ. కరోనాపై భారత్ పోరాటాన్ని నేతాజీ చూసి ఉంటే… ఆయన గర్వంగా ఫీలయ్యేవారని చెప్పారు.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

పిలిచి అవమానిస్తారా?. మోడీ ముందే మమత ఆగ్రహం