ప్రపంచంలోనే భారత్ కు పాజిటివ్ ఇమేజ్

ప్రపంచంలోనే భారత్ కు పాజిటివ్ ఇమేజ్

జల్ జీవన్ మిషన్ కింద మూడున్నర కోట్ల గ్రామీణ ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించామన్నారు ప్రధాని మోడీ. 2014 నుంచి 2 కోట్ల 40లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. 6 రాష్ట్రాల్లో మోడ్రన్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మిస్తున్నట్టు మోడీ చెప్పారు. కరోనాను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ఎదుర్కొన్నాయని మోడీ చెప్పారు. మన దేశంపై ప్రపంచంలో పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అయిందన్నారు మోడీ.

నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. వ్యవసాయం, మౌలిక వసతులు, తయారీ రంగం, మానవ వనరుల అభివృద్ధి, గ్రాస్ రూట్ లెవెల్లో సేవలు, హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, CEO అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సభ్యులు మీటింగ్ లో పాల్గొంటున్నారు.

పేరుకే హైదరాబాద్.. లోకల్ ప్లేయర్ లేకుండానే బరిలోకి..