
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష కోట్లు పేదల అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేశామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. స్లమ్ లలో నివసిస్తున్న పక్కా ఇళ్లు లేని 3 కోట్ల కుటుంబాలు ఒకే పథకంతో లక్షాధికారులయ్యారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పర్యటించారు మోడీ. ఆజాదీ ఎట్ 75-న్యూ అర్బన్ ఇండియా ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ లోని 75 జిల్లాల్లో 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన తాళాలు అందజేశారు. 2017 లో యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఏర్పడ్డాక... 9 లక్షల ఇళ్లు ఇచ్చామని చెప్పారు.