మమతా సర్కార్ పథకాలు ఆ పార్టీ నేతలకే…

మమతా సర్కార్ పథకాలు ఆ పార్టీ నేతలకే…

బెంగాల్ ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోడీ. బెంగాల్  లో సిండికేట్ రాజ్యం నడుస్తోందన్నారు. కేంద్రం రైతులు, పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తోందన్నారు. కానీ మమతా సర్కార్ పథకాలు ఆ పార్టీ నేతలకు మాత్రమే ఉపయోగపడతాయన్నారు. అందుకే టీఎంసీ నేతలు ధనవంతులుగా మారుతున్నారని, సాధారణ ప్రజలు పేదలుగానే మిగిలిపోతున్నారంటూ విమర్శించారు. బంకీం చంద్ర ఛటర్జీ నివసించిన వందేమాతరం భవనాన్ని మమత సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు మోడీ. ఇది బెంగాల్ ఆత్మగౌరవానికి అన్యాయం చేయడమేనన్నారు. మోడీ వేదికపైకి వచ్చేటప్పుడు జనమంతా వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్ కతా మెట్రో విస్తరణ ప్రాజెక్టును ప్రారంభించారు మోడీ. నోవాపార నుంచి దక్షిణేశ్వర్ వరకు నడిచే రైలును వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు.

ఓడిపోయే స్థానంలో మా చిన్నమ్మకు టికెట్ : పీవీ మనవడు

ఒకే అడ్రస్ పై 32.. బోధన్ లో నకిలీ పాస్ పోర్టుల కలకలం