అనాథకు కిడ్నీ దానం చేసిన మహిళకు ప్రధాని సెల్యూట్

అనాథకు కిడ్నీ దానం చేసిన మహిళకు ప్రధాని సెల్యూట్

న్యూఢిల్లీ: ఓ అనాథకు కిడ్నీ డొనేట్ చేసిన మహిళను ప్రధాని మోడీ మెచ్చుకుంటూ లెటర్ రాశారు. అవయవదానం గొప్ప దానమంటూ ప్రధాని మోడీ స్పీచ్ తో కోల్ కతాకు చెందిన మానసి హల్దార్ (48) స్ఫూర్తి పొంది 2014లోనే కిడ్నీ డొనేట్ చేశారు. ఇటీవల ప్రధాని మోడీకి ఆమె లెటర్​ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. దీనికి జవాబుగా మానసి హల్దార్​ను మెచ్చుకుంటూ ప్రధాని లెటర్ రాశారు. ‘ఒక విలువైన ప్రాణాన్ని కాపాడేందుకు మీరు కిడ్నీ దానం చేయడం నన్ను కదిలించింది. మీరు చేసిన త్యాగాన్ని మెచ్చుకోవడానికి మాటలు చాలవు. త్యాగం, కరుణ మన సంస్కృతి, సంప్రదాయాల్లోనే ఉన్నాయి. అవయవదానం గొప్పదానం. ఒక వ్యక్తికి కొత్త జీవితం ఇచ్చినట్టే. మన దేశంలో లక్షల మందికి ఆర్గాన్స్ అవసరం ఉన్నాయి. అవయవదానంపై అవేర్ నెస్ కల్పించి, అవసరమైనవాళ్లకు ఆర్గాన్స్ అందేలా చూసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి’ అని లెటర్ లో ప్రధాని పేర్కొన్నారు.

 

For More News..

ప్రశ్నించే గొంతు మూగబోయింది

ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది