కరోనా సంక్షోభం వేళ.. యోగా ఓ ఆశాకిరణం

కరోనా సంక్షోభం వేళ.. యోగా  ఓ ఆశాకిరణం

కరోనా సంక్షోభం వేళ యోగా ఓ ఆశాకిరణం లాంటిదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించారు మోడీ. ప్రతి దేశం, సమాజం యోగాతో స్వస్థత పొందుతొందన్నారు. కరోనాపై పోరులో యోగా సురక్ష కవచం లాంటిదన్నారు. డాక్టర్లు కూడా యోగా ను ఉపయోగించారని చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహకారంతో భారత్ ఎమ్ యోగా యాప్ తీసుకువచ్చినట్లు తెలిపారు. యోగా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపుతుందన్నారు. యోగా నెగెటివిటి నుంచి క్రియెటివిటీ వైపు నడిపిస్తుందన్నారు.

యోగా డే సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఢిల్లీలోని తన నివాసంలో యోగా చేశారు. ఈ సందర్భంగా యోగా గొప్పతనాన్ని వివరించారు. యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. అటు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కూడా యోగా చేశారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా  అన్నారు గిరిరాజ్ సింగ్. 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు యోగా గురు రాందేవ్ బాబా. ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని నిరామయం యోగ్ గ్రామ్ లో  ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆచార్య బాలకృష్ణ కూడా రాందేవ్ బాబాతో కలిసి యోగా చేశారు. ఈ కార్యక్రమానికి పిల్లలతో పాటు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.