ప్రమాదం ఇంకా పోలే.. కరోనాపై పోరాటాన్ని వీక్ కానివ్వొద్దు

ప్రమాదం ఇంకా పోలే.. కరోనాపై పోరాటాన్ని వీక్ కానివ్వొద్దు

న్యూఢిల్లీ‘‘కరోనా మహమ్మారిపై మనం చేస్తున్న ఈ పోరాటాన్ని బలహీనం కానివ్వకూడదు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా ఇంకా డేంజరస్​గానే ఉంది. మీరు, మీ కుటుంబం.. కరోనా నుంచి తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది” అని ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్ చేశారు. మాస్క్​లు పెట్టుకుని, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. దేశంలో చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, ప్రజలు ఇప్పుడు ఇంకా అలర్ట్​గా, కేర్​ఫుల్​గా ఉండాలని సూచించారు. ఆదివారం ‘మన్‌‌‌‌ కీ బాత్‌‌‌‌’ ద్వారా ప్రజలతో ప్రధాని మాట్లాడారు. కరోనా సంక్షోభం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పేదలు, కూలీల బాధలు మాటల్లో చెప్పలేం

కరోనా సంక్షోభ సమయంలో పేదలు, కూలీలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వారి బాధలు మాటల్లో చెప్పలేమని మోడీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లు పడ్డారని, కానీ పేదలపైనే ఎక్కువగా ప్రభావం పడిందన్నారు. పేదలు, లేబర్లను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం చేశారని, శ్రామిక్ రైళ్లు నడిపిన రైల్వే లక్షలాది మందిని సొంతూళ్లకు తరలించిందని చెప్పారు. ‘‘మన గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు స్వావలంబన కలిగి ఉండి ఉంటే.. ఇప్పుడు మనకు ఎదురైన సమస్యలు అంత పెద్దవిగా కనిపించేవి కావు. ఇలా ఎక్కువ రోజులు ఉండదు.. ఎందుకంటే చీకటి నుంచి వెలుగు వైపు వెళ్లడం మనిషి లక్షణం” అని ఆయన కామెంట్ చేశారు.

విరుగుడు లేని శాపం

‘‘కరోనాపై మనం చేస్తున్న పోరాటం ఇంకా చాలా దూరం వెళ్తుంది. ఇది ఒక విపత్తు. ప్రపంచానికి విరుగుడు లేని శాపంగా ఉంది. దానిపై గతంలో మనకు ఎలాంటి ఎక్స్​పీరియన్స్ లేదు. కొత్త సవాళ్లను, పర్యవసానాలను ఎదుర్కొంటున్నాం” అని మోడీ చెప్పారు. అన్ని దేశాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో ఇండియా మినహాయింపు కాదన్నారు. భవిష్యత్ పాఠాలు నేర్చుకునేందుకు ఇది సరైన సమయమన్నారు. ‘‘మన జనాభా చాలా దేశాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు కొత్తవి. అయినా ప్రపంచంలోని ఇతర దేశాల్లో వ్యాపించినంత వేగంగా ఇండియాలో స్ప్రెడ్ కాలేదు. వైరస్ మరణాల సంఖ్య కూడా మనదేశంలో తక్కువ” అని మోడీ చెప్పారు.

ఇదో హెచ్చరిక

‘‘ఒకవైపు ఈస్టర్న్ ఇండియా తుఫాను విపత్తును ఎదుర్కొంటోంది. మరోవైపు మిగతా రాష్ర్టాలు మిడతల వల్ల ప్రభావితమయ్యాయి. ఒక చిన్న జీవి భారీ నష్టాన్ని కలిగించగలదన్న దానికి మిడతల దాడి ఓ హెచ్చరిక. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మిడతల దాడిని ఎదుర్కొనేందుకు ఇన్నోవేషన్లపై దృష్టి పెడుతున్నం’’ అని మోడీ వివరించారు. కొన్ని రోజులుగా మిడతల దాడులు జరుగుతున్నాయని, భారీగా నష్టం జరుగుతోందని అన్నారు. ‘‘కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖలు, ఇతర పరిపాలన యంత్రాంగాలు మోడర్న్ టెక్నిక్స్ వాడుతున్నాయి. రైతులకు హెల్ప్ చేయడమే కాదు.. నష్టం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని చెప్పారు. మిడతల దాడి వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని ఇన్నోవేషన్ల ద్వారా ఎదుర్కోగలమనే నమ్మకం ఉందని అన్నారు. కరోనా సమయంలో చాలా మంది ఎన్నో ఆవిష్కరణలు చేశారని చెప్పారు.

యోగా ఇంపార్టెన్స్ పెరిగింది..

కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రపంచానికి యోగా, ఆయుర్వేదం అంటే ఏంటో తెలిసొచ్చిందని మోడీ చెప్పారు. “ప్రపంచంలోని చాలా మంది లీడర్లతో మాట్లాడాను. వాళ్లంతా ఆయుర్వేదం, యోగాపై ఇంట్రెస్ట్‌‌‌‌ చూపిస్తున్నారు. ఈ టైంలో యోగా, ఆయుర్వేదం ఎలా ఉపయోగపడిందో తెలుసుకున్నారు. ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. హాలీవుడ్‌‌‌‌ నుంచి హరిద్వార్‌‌‌‌‌‌‌‌ వరకు ప్రతి ఒక్కరు యోగాను నేర్చుకున్నారు” అని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యోగా గురించి తెలుసుకుంటున్నారని, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ క్లాసులు కూడా పెరిగాయని తెలిపారు.

ట్యాక్స్ పేయర్లకు థ్యాంక్స్

‘ఆయుష్మాన్ భారత్’ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు సాయం చేసిన ఘనత నిజాయితీ గల ట్యాక్స్ పేయర్లదేనని ప్రధాని మోడీ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా లబ్ధి పొందుతున్న పేదల సంఖ్య కోటి దాటిందని చెప్పారు. ‘‘కోటి కంటే ఎక్కువ మంది పేషెంట్లు అంటే ఏంటో తెలుసా? రెండు నార్వేలు, రెండు సింగపూర్లతో సమానం. తక్కువ సమయంలోనే ఫ్రీ ట్రీట్​మెంట్ అందించాం” అని వివరించారు. ఆయుష్మాన్ భారత్‌ లో పోర్టబులిటీ ఫెసిలిటీ ఉందని, ఒక రాష్ర్టానికి చెందిన వ్యక్తి మరో రాష్ర్టంలో వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు.

  • అంపన్ తుఫానును ఎదుర్కొనే విషయంలో వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ప్రజలు ఎంతో ధైర్యం చూపారు. దేశం మొత్తం వారి వెంటే ఉంది.
  • కార్మికుల ‘స్కిల్ మ్యాపింగ్’ చేస్తున్నాం. మైగ్రేషన్ కమిషన్ ఏర్పాటు చర్చలు జరుగుతున్నాయి.
  • ప్రజలు ఇప్పుడు లోకల్ ప్రొడక్టులనే కొంటున్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ను తమ సొంత ఉద్యమంగా తీసుకోవడం ప్రారంభించారు.
  • మనకు కలిగిన నష్టం విషయంలో మనమంతా తీవ్రంగా బాధపడుతున్నాం. కానీ మనం ఇప్పుడు సాధించినదంతా.. దేశం సమష్టి సంకల్ప ఫలితం.
  • అన్ని జాగ్రత్తలతో డొమెస్టిక్ ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ ఫ్లైట్లను తిరిగి ప్రారంభించాం. త్వరలోనే ఇండస్ట్రియల్‌‌‌‌ యాక్టివిటీస్‌‌‌‌ రీబూట్‌‌‌‌ చేస్తాం.
  • కరోనాపై వైద్య సిబ్బంది, మీడియా పర్సన్లు ప్రాణాలు లెక్కచేయకుండా పని చేశారు.

ఇతర రాష్ట్రాలకు రాకపోకలకు ఓకే