షిండే, ఫడ్నవీస్లకు మోడీ శుభాకాంక్షలు

షిండే, ఫడ్నవీస్లకు మోడీ శుభాకాంక్షలు

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  కార్యకర్త స్థాయి నుంచి నుంచి సీఎంగా ఎదిగిన షిండేను మోడీ అభినందించారు. షిండేకు ఉన్న శాసన, పరిపాలన అనుభవంతో  మహారాష్టను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తాడని మోడీ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి షిండే ..రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడన్న నమ్మక ముందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. 

అటు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్రఫడ్నవీస్ ను  ప్రధాని మోడీ అభినందించారు.  ఫడ్నవీస్ ప్రతీ బీజేపీ కార్యకర్తకు స్పూర్తి అని కొనియాడారు. ఫడ్నవీస్ అనుభవం, నైపుణ్యం ప్రభుత్వానికి ఆస్తి అని అభివర్ణించారు. అతను మహారాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాడని అనుకున్నట్లు మోడీ అభిప్రాయపడ్డారు.