దేశమంతా మోడీ వెంట..మరింత బలమైన నేతగా ప్రధాని

దేశమంతా మోడీ వెంట..మరింత బలమైన నేతగా ప్రధాని

న్యూయార్క్కరోనాపై పోరులో ప్రధాని నరేంద్ర మోడీ ముందు నడుస్తుంటే.. ఆయనకు మద్దతుగా దేశమంతా వెనుక వస్తోందని న్యూయార్క్ టైమ్స్ కామెంట్ చేసింది. ప్రస్తుత సంక్షోభాన్ని మోడీ ఎదుర్కొంటున్న తీరును ప్రశంసించింది. మోడీ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారని తెలిపింది. ప్రధాని మోడీని ఓ మొబిలైజర్ గా అభివర్ణించింది. కరోనా టైమ్ లో మోడీ ప్రాభవం మరింత పెరిగిందంటూ ఓ స్టోరీ పబ్లిష్ చేసింది. మోడీకి ఆదరణ బాగా పెరిగిందని, ఒకానొక సమయంలో 90 శాతానికి చేరిందని చెప్పింది. తొలిసారి లాక్​డౌన్ ప్రకటించిన నాటి నుంచి ప్రధాని తీసుకుంటున్న చర్యలను, ఆయన పనితీరును వివరించింది. ఐడియాలజీతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యక్తుల అభిప్రాయాలను తీసుకొని కరోనా నివారణకు కృషి చేస్తున్నారని, ప్రజల్లో భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.

నియంత కాదు.. మొబిలైజర్

ప్రధాని మోడీని ప్రజలు ఓ మొబిలైజర్ (జనాన్ని సంఘటిత పరిచగలిగే వ్యక్తి) మాదిరి చూస్తున్నారని, నిరంకుశ పాలకుడిలా కాదని న్యూయార్క్ టైమ్స్ కామెంట్ చేసింది. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఆయన ఇచ్చిన పిలుపులకు ప్రజలు స్పందించిన తీరే ఇందుకు నిదర్శనమని చెప్పింది. మూడు సార్లు ప్రజలకు ముందుకు వచ్చి పలు ప్రకటనలు చేశారని.. అన్నింటిని ప్రజలు పాటించారని చెప్పింది. ప్రధాని మోడీ చెప్పగానే… జనతా కర్ఫ్యూ, చప్పట్లు కొడుతూ అభినందించటం, దీపాలు వెలిగించటం వంటి కార్యక్రమాలకు జనం సపోర్ట్​గా నిలిచారని గుర్తుచేసింది. కరోనా వ్యాప్తిని ఇండియా సమర్థంగా అడ్డుకోగలిగితే.. ఎన్నడూ లేనంతా శక్తివంతమైన నేతగా మోడీ అవతరిస్తారని చెప్పింది.

మైగ్రెంట్ల ఇక్కట్లు

మైగ్రెంట్ వర్కర్స్ పడుతున్న ఇబ్బందులను న్యూయార్క్ టైమ్స్ రాసుకొచ్చింది. వారికి సరైన వసతులు కల్పించకపోవటంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పింది. లాక్​డౌన్ వల్ల పనులు లేక, సొంతూళ్లకు తిరిగి వెళ్లలేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. యూపీలోని ఔరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావించింది.

పెరుగుతున్న అంతర్జాతీయ మద్దతు

కరోనా సమయంలో మోడీ ఇమేజ్ భారీగా పెరుగుతోందంటూ ‘మార్నింగ్‌‌ కన్సల్ట్‌‌’.. ఐఏఎన్‌‌ఎస్‌‌‌‌–సీ–ఓటర్‌‌ సంస్థలు ఈ మధ్య సర్వే చేసి చెప్పాయి. అంతకుముందు డబ్ల్యూహెచ్​వో కూడా మోడీ చర్యలను పొగిడింది. ఇక మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్.. ప్రధానిని పొగుడుతూ లెటర్ రాశారు. తాజాగా ఈ లిస్టులోకి న్యూయార్క్ టైమ్స్ చేరింది.

ఉన్నది ఉన్నట్లు చెప్పారు

‘‘కరోనా వైరస్ గురించి మోడీ ఎన్నడూ డౌన్​ప్లే చేయలేదు. పరిస్థితి గురించి, ముప్పు గురించి నిజాలే చెప్పారు. ఐడియాలజీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాల అధికారులతో కలిసి బాగా పనిచేశారు” అని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. 130 కోట్ల ఇండియా జనాభాతో పోలిస్తే.. నమోదైన కేసులు, డెత్​లు చాలా తక్కువ అని చెప్పింది.

ట్రంప్, పుతిన్ కన్నా బెటర్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వంటి నేతలతో మోడీని న్యూయార్క్ టైమ్స్ కంపేర్ చేసింది. వారి కన్నా మోడీకి ప్రజాదరణ ఎక్కువగా ఉందని చెప్పింది. పుల్వామా తర్వాత జరిగిన ఘటనలు బలమైన నేతగా నిలిపితే, కరోనా సమయంలో తీసుకున్న చర్యలు దృఢమైన నాయకుడిగా మార్చయంది.

అమెరికాలో కరోనా టీకా సక్సెస్