కెప్టెన్ రుచిశర్మకు మోడీ సోషల్ మీడియా బాధ్యతలు

కెప్టెన్ రుచిశర్మకు మోడీ సోషల్ మీడియా బాధ్యతలు

ప్రధాని మోడీ సోషల్ మీడియా బాధ్యతను చూసుకునే అరుదైన అవకాశం భారత తొలి పారాట్రూటర్ ఆపరేటర్ కెప్టెన్ రుచిశర్మకు దక్కింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఒక్కరోజు తన అకౌంట్లను చూసుకునే అవకాశం ఒక స్పూర్తిదాయక మహిళకు కల్పిస్తానని చెప్పారు. ఈ మేరకు  #SheInspiresUs అనే హాష్ గ్యాగ్ తో మీకు తెలిసిన ట్యాలెంటెడ్ మహిళల గురించి సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను కోరారు.

ఈ క్రమంలోనే శీలాభట్ అనే మహిళ కెప్టెన్ రుచిశర్మ స్టోరీని ప్రధాని మోడీ అకౌంట్ కు పోస్ట్ చేసింది. దీంతో రుచిశర్మ స్టోరీని మోడీ కార్యాలయం అధికారులు చదివారు. స్పూర్తిదాయక మహిళగా రుచిశర్మను గుర్తించారు. మోడీ ఖాతాలను ఒకరోజు రుచిశర్మకు అప్పగించనున్నట్లు ప్రకటించింది మోడీ కార్యాలయం. ఈ విషయాన్ని తెలుపుతూ మోడీ కార్యాలయం రుచిశర్మ గురించి..” ఆకాశానికి హద్దులేదు. కెప్టెన్ రుచిశర్మ ఇప్పటికీ మహిళల్లో స్పూర్తి నింపుతూనే ఉన్నారు” అని ట్వీట్ చేసింది.

రుచిశర్మ గురించి

1996లో భారత ఆర్మీలో చేరిన రుచిశర్మ 2003 వరకు సేవలు అందించారు. ఈ క్రమంలోనే మొట్టమొదటి మహిళా పారాట్రూటర్ ఆపరేటర్ గా గుర్తింపు పొందారు. పారాట్రూటర్ ఆపరేటర్ అంటే యుద్ధ సమయాల్లో పారాచ్యూట్ సాయంతో శత్రువులపై దాడులు చేస్తుంటారు. శత్రువులు భూభాగానికి దగ్గరలో దూకిన తర్వాత వీపు భాగంలో 10కిలీల బరువుతో 40-50కిలీమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ ట్రైయినింగ్ కూడా ఎంతో శ్రమ, కష్టంతో కూడుకున్నది.

ప్రధాని మోడీ సోషల్ మీడియా బాధ్యత చూసుకునే అరుదైన అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు రుచిశర్మ. ఈ సందర్భంగా మాట్లాడిని ఆమె..ఆడవాళ్లు శారీరక బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తాను ఇప్పటికీ యుద్ధానికి రెడీగా ఉన్నానని తెలిపారు. ఆర్మీలో చేరడానికి మహిళలు ముందుకు రావాలని చెప్పుకొచ్చారు ఈ ఐరన్ లేడీ.

See Also: తెలుగులోనూ కరోనా కాలర్ ట్యూన్

టీమిండియాలో ఆ ముగ్గురికి అగ్ని పరీక్షే..!

ప్రభాస్ సినిమాకు టైటిల్ ఇదేనా..?

అమెజాన్ లో భారీ ఆఫర్ కొట్టేసిన అమ్మాయిలు