
మోదీ గెలుపు అంటే మనందరి గెలుపు అని.. మోదీ గెలుపు భారతదేశ విజయంగా చెప్పుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. 2025, అక్టోబర్ 16వ తేదీ కర్నూలు జిల్లా ఊర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో జరిగిన సూపర్ GST.. సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారాయన. రాయలసీమలో త్వరలోనే హైకోర్ట్ బెంజ్ వస్తుందని.. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్ వస్తుందని వివరించారు సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లాలో ఇన్ని పరిశ్రమలు రావటం చారిత్రాత్మకంగా స్పష్టం చేశారు చంద్రబాబు.
ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా విద్యుత్, రైల్వే, హైవే, డిఫెన్స్ రంగాలకు చెందిన 13 వేల 430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరగటం శుభపరిణామం అన్నారాయన. 4 వేల 922 కోట్ల విలువైన కొప్పర్తి ఊర్వకల్లు కారిడార్ వస్తుందని.. ఇది చారిత్రాత్మకంగా అభివర్ణించారు సీఎం చంద్రబాబు.
రాబోయే అన్ని ఎన్నికల్లో.. బీహార్ ఎన్నికల్లోనూ మోదీ గెలవాలని.. అదే భారత విజయం.. మన విజయంగా పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.