ప్రధాని మోడీ ఆస్తి ఏడాదిలో 22 లక్షలు పెరిగింది

ప్రధాని మోడీ ఆస్తి ఏడాదిలో 22 లక్షలు పెరిగింది

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు నిరుటి కంటే కొద్దిగ పెరిగినయి. 2020లో రూ. 2.85 కోట్లు ఉన్న ఆయన ఆస్తి ప్రస్తుతం రూ.3.07 కోట్లకు చేరింది. ఏడాది కాలంలో ఆయన సంపద రూ. 22 లక్షలు పెరిగింది. ఏటా ఆస్తులు, అప్పులు వివరాలు వెల్లడిస్తున్న మోడీ.. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలు ప్రకటించారు. గుజరాత్‌‌లోని గాంధీనగర్ ఎస్‌‌బీఐ బ్రాంచ్‌‌లో మోడీ ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ల విలువ నిరుడు రూ. 1.60 కోట్లు ఉండగా ఈ ఏడాదిమార్చి 31 నాటికి రూ. 1.86 కోట్లకు పెరిగింది. ఆయన దగ్గర 4 గోల్డ్​రింగ్స్​ఉండగా వాటి విలువ 1.48 లక్షలుగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 1.5 లక్షలు, లిక్విడ్​ క్యాష్​రూ. 36 వేలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోడీ ఎలాంటి ఆస్తులు కొనలేదు. సొంత వాహనం కూడా లేదు. 2002లో మోడీ సహా మరో ముగ్గురు పార్ట్​నర్లు కొన్న బిల్డింగ్ విలువ రూ. 1.10 కోట్లుగా ఉంది.