
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడుతూ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లోనూ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. భారత జట్టులోనే కాదు ప్రపంచంలోనే బుమ్రా టాప్ బౌలర్లలో ఒకడు. మరో నాలుగు నుంచి ఐదేళ్లపాటు టీమిండియాకు తన బౌలింగ్ సేవలు అందించే అవకాశం ఉంది. బుమ్రా పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ మ్యాచ్ లు ఆడేలా.. ప్రధాన మ్యాచ్ లకు రంగంలోకి దించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో బుమ్రా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని టీమిండియా మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
జస్ప్రీత్ బుమ్రా తన టెస్ట్ కెరీర్‌ను త్వరలోనే ముగించే అవకాశం ఉందని కైఫ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్‌లో ఈ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ ఇబ్బందిగా కనిపించాడని.. అతని వేగం కూడా తగ్గించని కైఫ్ అన్నాడు. "జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ ఫార్మాట్ ఆడతాడని నేను భావించడం లేదు. అతను రిటైర్మెంట్ తీసుకుంటాడని నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం బుమ్రా తన ఫిట్ నెస్ తో ఇబ్బంది పడుతున్నాడు. మాంచెస్టర్ టెస్ట్‌లో అతని వేగం తగ్గింది". అని కైఫ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన వీడియోలో అన్నారు.
ALSO READ : జస్టిస్ నవీన్ రావుకు హెచ్‌సీఏ పర్యవేక్షణ బాధ్యతలు
"బుమ్రా నిస్వార్థపరుడు. దేశం కోసం 100 శాతం ఇవ్వలేకపోతున్నానని, మ్యాచ్ గెలవలేకపోతున్నానని, వికెట్లు తీయలేకపోతున్నానని అతను భావిస్తే, అతను గుడ్ బై చెబుతాడు. ఇది నా మనసులోని మాట. అతను బంతిని 130-135 వేగంతో విసురుతున్నాడు. అతను ఫిట్‌నెస్ లో ఇబ్బందులు ఉన్నాయి. శరీరం అతనికి బౌలింగ్ వేయడానికి సహకరించడం లేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లేకుండా అలవాటు పడిన అభిమానులు.. బుమ్రా లేకుండా టెస్ట్ మ్యాచ్ లు చూడడానికి అలవాటు చేసుకోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను" అని కైఫ్ అన్నాడు.
ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో బుమ్రా కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. ఓవరాల్ గా 28 ఓవర్లలో 95 పరుగులు ఇచ్చి జెమీ స్మిత్ వికెట్ తీసుకున్నాడు. ఈ సిరీస్ లో ఆడిన రెండు టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా.. నాలుగో టెస్టులో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. బుమ్రా ఒక్క బంతికి కూడా 140 కి.మీ వేగంతో విసరలేకపోయాడు. పని భారం కారణంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో మూడు టెస్ట్ మ్యాచ్ లే ఆడతానని చెప్పిన బుమ్రా చివరి టెస్ట్ ఆడతాడో లేదో చూడాలి.
Former India batter Mohammad Kaif sparked debate with a bold statement, suggesting that Jasprit Bumrah may soon walk away from Test cricket.👀#MohammedKaif #JaspritBumrah pic.twitter.com/HLS95DHSHD
— CricTracker (@Cricketracker) July 26, 2025