కెప్టెన్ గా తప్పుకున్నా.. ఆటగాడిగా కంటిన్యూ అవుతా : మహ్మద్ నబీ

కెప్టెన్ గా తప్పుకున్నా.. ఆటగాడిగా కంటిన్యూ అవుతా : మహ్మద్ నబీ

టీ 20 ప్రపంచ కప్ లో ఆసీస్, అప్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచి..సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కెప్టెన్సీ పదవి నుంచి మహ్మద్ నబీ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశాడు. ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించాడు. టీ20 వరల్డ్ కప్ ప్రయాణం నేటితో ముగిసిందని.. ఈ ప్రయాణంలో వచ్చిన ఫలితాలు తమకు..మద్దతుదారులకు గానీ నచ్చలేదని తెలిపాడు. అందుకే ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. గత సంవత్సరం నుంచి జట్టు సన్నద్దత కెప్టెన్ కొరుకోనే స్ధాయిలో లేదన్నాడు. కొన్ని పర్యటనల్లో జట్టు మేనేజ్ మెంట్, సెలక్షన్ కమిటీ.. తాను ఒకే పేజీలో లేమని చెప్పాడు. ఇది జట్టు బ్యాలెన్స్ పై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇదే విషయాన్ని మేనేజ్ మెంట్ కు చెప్పడం జరిగిందన్నాడు. కెప్టెన్ గా తప్పుకున్నా.. ఓ ఆటగాడిగా కంటిన్యూ అవుతానని వెల్లడించాడు. వర్షం కారణంగా రెండు మ్యాచ్ లు దెబ్బతిన్నా... తమపై అభిమానంతో మైదానాలకు వచ్చిన ప్రతొక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు. అభిమానుల ప్రేమ తమకు చాలా ముఖ్యమైందని.. లవ్ యూ అప్ఘనిస్తాన్ అంటూ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఆ తర్వాత 169 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన  అఫ్గనిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్లో అఫ్ఘనిస్తాన్ పోరాడి ఓడింది. విజయానికి చేరువగా వచ్చి పరాజయం చవిచూసింది.