అక్బరుద్దీన్ పై దాడి చేసిన పహిల్వాన్ గుండెపోటుతో మృతి

అక్బరుద్దీన్ పై దాడి చేసిన పహిల్వాన్ గుండెపోటుతో మృతి

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై అత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ పహిల్వాన్ ఇవాళ మృతి చెందాడు. గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 2011లో పాతకక్షల నేపథ్యంలో పహిల్వాన్ అక్బరుద్దీన్ పై గన్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో అక్బరుద్దీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. మూడేళ్ల పాటు ట్రీట్ మెంట్ తీసుకున్నప్పటికీ అక్బరుద్దీన్ శరీరంలో బుల్లెట్ అలాగే ఉంది. ఈ కేసులో చాలా రోజుల పాటు పహిల్వాన్ జైల్లో ఉన్నాడు. బెయిల్ రాకపోవడంతో సుప్రీం కోర్టు కెళ్లి  బెయిల్ తెచ్చుకున్నాడు. రిలీజ్ అయి బయటకు వచ్చాడు. గత కొంతకాలంగా కుటుంబంతో ఉంటున్న పహిల్వాన్ గుండె పోటు రావడంతో మృతి చెందాడు.

see more news

జేసీకి ఝలక్.. సెక్యూరిటీ తొలగింపు

‘శత‘క్కొట్టిన రాహుల్.. న్యూజిలాండ్ టార్గెట్ 297