ఇంగ్లండ్‌ సవాల్‌కు రెడీ అంటున్న సిరాజ్

ఇంగ్లండ్‌ సవాల్‌కు రెడీ అంటున్న సిరాజ్
  • ఇషాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు రెడీ
  • టీమిండియా యంగ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకున్న టీమిండియా యంగ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు సొంతగడ్డపై ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై మరింత బెస్ట్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయాలని చూస్తున్నాడు.  వచ్చే 5వ తేదీ నుంచి జరిగే సిరీస్‌‌‌‌‌‌‌‌లో సీనియర్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ ఇషాంత్‌‌‌‌‌‌‌‌ శర్మతో కలిసి బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని, ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు తాను ఫుల్‌‌‌‌‌‌‌‌గా ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యానని ఈ హైదరాబాదీ చెబుతున్నాడు.  ‘దేశం కోసం బాగా ఆడాలని అనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో చేసిన విధంగా ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌లో కూడా ఇండియాను గెలిపించే ప్రయత్నం చేస్తా.  ఫామ్‌‌‌‌‌‌‌‌ కొనసాగించి మంచి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తానని నమ్మకంగా ఉన్నా. ఆస్ట్రేలియా సిరీస్‌‌‌‌‌‌‌‌ నాకు లభించిన గొప్ప అవకాశం. డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్స్‌‌‌‌‌‌‌‌, నెట్‌‌‌‌‌‌‌‌ సెషన్స్‌‌‌‌‌‌‌‌ షేర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడంతో పాటు పుజారా, రహానె, షమీ, రోహిత్‌‌‌‌‌‌‌‌, బుమ్రా వంటి సీనియర్లు, రవి సార్‌‌‌‌‌‌‌‌ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.  సీనియర్‌‌‌‌‌‌‌‌ పేసర్లు చాలా టిప్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ముఖ్యంగా  ప్రెజర్‌‌‌‌‌‌‌‌ను హ్యాండిల్‌‌‌‌‌‌‌‌ చేయడం ఎలానో షమీ భాయ్‌‌‌‌‌‌‌‌, రవి సార్‌‌‌‌‌‌‌‌ నేర్పించారు. వాటిని ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేస్తా.  నేను ఇండియాలో ఆడుతున్నానా? ఫారిన్‌‌‌‌‌‌‌‌లో ఆడుతున్నానా? అనేది పట్టించుకోను. టీమ్‌‌‌‌‌‌‌‌ను  గెలిపించాలన్నదే నా టార్గెట్‌‌‌‌‌‌‌‌. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌కు నేను పూర్తిగా ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యా. ఆసీస్‌‌‌‌‌‌‌‌లో బుమ్రా, షమీ, శార్దూల్‌‌‌‌‌‌‌‌తో కలిసి బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశా. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఇషాంత్‌‌‌‌‌‌‌‌ శర్మతో కలిసి బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ఎగ్జయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా. తనతో కలిసి ఆడితే నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటా’ అని సిరాజ్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌కు ముగ్గురు ఇండియా అంపైర్లు

ఇంగ్లండ్‌‌తో వచ్చే నెల నుంచి జరిగే నాలుగు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌లో ఇండియాకు చెందిన ముగ్గురు అంపైర్లు ఆన్‌‌ఫీల్డ్‌‌ బాధ్యతలు నిర్వహించనున్నారు.  నితిన్‌‌ మీనన్‌‌, వీరేందర్‌‌ శర్మ, అనిల్‌‌ చౌదరి  ఈ సిరీస్‌‌కు అంపైర్లుగా ఎంపికయ్యారు.  దీంతో ఐసీసీ ఎమిరేట్స్‌‌ ప్యానెల్‌‌ మెంబర్స్‌‌ అయిన అనిల్‌‌, వీరేందర్‌‌ తొలిసారి ఇంటర్నేషనల్‌‌ టెస్ట్‌‌ మ్యాచ్‌‌ల్లో అంపైర్‌‌గా పని చేయనున్నారు. ఎలైట్‌‌ ప్యానెల్‌‌ మెంబర్‌‌ అయిన నితిన్‌‌ మీనన్‌‌కు మాత్రం టెస్ట్‌‌ మ్యాచ్‌‌ల అనుభవం ఉంది. కరోనా ప్రొటోకాల్స్‌‌లో భాగంగా వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మ్యాచ్‌‌ల్లో హోమ్‌‌టీమ్‌‌కు చెందిన అఫీషియల్స్‌‌ను పూర్తి వినియోగించుకునేందుకు ఐసీసీ చాన్స్‌‌ ఇచ్చింది. దీంతో ఇండియా అంపైర్లకు చాన్స్‌‌ దొరికింది. నితిన్‌‌ మీనన్‌‌ ఇప్పటిదాకా మూడు టెస్టులు, 24 వన్డేలు, 16 టీ20 మ్యాచ్‌‌ల్లో అంపైరింగ్‌‌ చేశాడు. వీరేందర్‌‌ రెండు వన్డేలు, ఓ టీ20లో ఆన్‌‌ ఫీల్డ్‌‌ అంపైర్‌‌గా పని చేయగా అనిల్‌‌ 20 వన్డేలు, 28 టీ20ల్లో  పని చేశాడు. ఈ ముగ్గురు అంపైర్లకు కావాల్సినంత ఐపీఎల్‌‌ అనుభవం కూడా ఉంది.

For More News..

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ

ఏ దేశం వెళ్లి పాడినా కోటి రూపాయలొస్తయ్​

టెన్త్​, ఇంటర్​తో జాబ్​ గ్యారంటీ కోర్సులు