ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సమైక్యతా సంబురాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు, పార్టీ ఆఫీసుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జెండా ఎగరేశారు. నిజామాబాద్​ కలెక్టరేట్​లో మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి జెండా ఎగురేశారు. ఎమ్మెల్యే గణేశ్​గుప్తా, మేయర్​నీతూ కిరణ్​ పాల్గొన్నారు. కామారెడ్డిలో స్పీకర్​పోచారం శ్రీనివాస్​రెడ్డి జాతీయజెండా ఎగరేశారు. జడ్పీ చైర్​పర్సన్​దఫేదర్​ శోభ,  ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు హన్మంతుషిండే, జాజాల సురేందర్, కలెక్టర్​ జితేశ్​వి.పాటిల్, మున్సిపల్ చైర్​పర్సన్​జాహ్నవి పాల్గొన్నారు. ఆర్మూర్, పిట్లం, మక్లూర్​మండలాల్లోనూ సమైక్యతా సంబురాలు నిర్వహించారు. 

కామారెడ్డి కోర్టును విజిట్​ చేసిన హైకోర్టు జడ్జి

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి జిల్లా కోర్టులో జరిగే జ్యూడిషియల్​ కాన్ఫరెన్స్​లో పాల్గొనేందుకు శనివారం హైకోర్టు జడ్జి, జిల్లా పోర్ట్​పోలియో జడ్జి జస్టిస్​ ఎం.జి.ప్రియదర్శిని వచ్చారు.  హైకోర్టు జడ్జికి ఆర్అండ్​బీ గెస్ట్​ హౌజ్​వద్ద కలెక్టర్​ జితేశ్​వి.పాటిల్​, ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి  స్వాగతం పలికారు.  అనంతరం కోర్టులో బార్​ అసోసియేషన్​ ప్రతినిధులు, అడ్వకేట్లు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిశారు.  బార్​అసోసియేషన్​ ప్రెసిడెంట్ అమృత్​రావు, జనరల్ సెక్రటరీ మసూద్​, ప్రతినిధులు జగన్నాథం, శ్యాంగోపాల్,  దామోదర్​రెడ్డి,  రజినీకాంత్​ ఉన్నారు.
సిద్ధరామేశ్వరుడిని దర్శించుకున్న జడ్జిలు
భిక్కనూరు, వెలుగు:  భిక్కనూరు మండల కేంద్రంలోని స్థానిక శ్రీపార్వతీ సిద్ధరామేశ్వర మహాక్షేత్రాన్ని శనివారం హెకోర్టు జడ్జి డీజే  ప్రియదర్శిని, కామారెడ్డి కోర్టు జడ్జి  శ్రీదేవి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో అర్చకులు సిద్ధగిరి శర్మ, రామగిరి శర్మ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చరిత్ర గురించి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్​ అందె మహేందర్​రెడ్డి జడ్జిలకు వివరించారు. వారితో పాటు పీపీ నంద రమేశ్, అడిషనల్​ పీపీ నరేందర్​రెడ్డి, కామారెడ్డి కోర్టు బార్​అసోసియేషన్​ అధ్యక్షుడు అమృతరావు, మాజీ అధ్యక్షుడు గజ్జెల భిక్షపతి, తహసీల్దార్​నర్సింలు, ఆలయ కమిటీ డైరెక్టర్ తాటికొండ బాబు, రాజుపంతులు, నవీన్​శర్మ ఉన్నారు.

మోడీ పాలనలో ఇండియా టాప్

నిజామాబాద్,  వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అగ్రరాజ్యంగా ఎదుగుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్​సూర్యనారాయణ అన్నారు. శనివారం ప్రధాని మోడీ బర్త్​డే సందర్భంగా  ఇందూరులోని పలు ఆలయాల్లో బీజేపీ ఆధ్వర్యంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాల్కల్  రోడ్డులోని ఆనంద నిలయం వసతి గృహంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి మోడీ జన్మదిన సంబరాలను జరిపారు. బీజేపీ జిల్లా కార్యాలయం లో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్​పాల్​ మాట్లాడుతూ ప్రధానిగా మోడీ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ప్రాచీన చరిత్రను కాపాడుతూనే నేటి ఆధునిక యుగానికి తగ్గట్టుగా దేశాన్ని తీర్చిదిద్దుతున్నారన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి చేస్తూ అగ్ర రాజ్యాలకు దీటుగా తయారు చేస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్​ సందగిరి రాజశేఖర్​రెడ్డి, కార్పొరేటర్​ మాస్టర్​శంకర్​, లీడర్లు నాగోళ్ల లక్ష్మీనారాయణ, అమంద్​ విజయ్​ , బూరుగుల  వినోద్​ భాస్కర్​ రెడ్డి పాల్గొన్నారు. 

ఇందల్వాయి, వెలుగు: ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, రూరల్​ ఇన్​చార్జి కులాచారి దినేశ్​అన్నారు. ప్రధాని బర్త్​డే సందర్భంగా శనివారం మండలకేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ మోడీ పాలన లో భారత్​ బలమైన శక్తి గా ఎదిగిందని అన్నారు. శిబిరంలో 96 మంది కార్యకర్తలు, లీడర్లు రక్తదానం చేశారని చెప్పారు. నిజామాబాద్​ పార్లమెంట్​ కన్వీనర్​, డిచ్​పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, పార్టీ మండల అధ్యక్షుడు నాయిడి రాజన్న, లీడర్లు కేపీ రెడ్డి, మోహన్​ రెడ్డి, శ్రీనివాస్​, రమేశ్, శ్రావణ్ పాల్గొన్నారు.

సెప్టెంబర్ 17 విద్రోహ దినమే
ఏఐకేఎంఎస్  రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ 

నందిపేట, వెలుగు: నిజాం సంస్థానంలో చట్టబద్ధ పాలన తెస్తామనే పేరుతో భారత సైన్యం అండతో దొరలు భూములను స్వాధీనం చేసుకున్నారని, కాబట్టి సెప్టెంబర్​17 ముమ్మాటికి తెలంగాణ విద్రోహ దినమేనని ఏఐకేఎంఎస్​ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్​ అన్నారు. 4 వేల మంది పోరాట యోధులు చనిపోతే దొరలు, భూస్వాములకు మంచి జరిగిందే తప్ప పేద ప్రజలకు ఏ ప్రయోజనం దక్కలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాధర్​, సాయరెడ్డి, మల్లన్న, దేవన్న పాల్గొన్నారు. 

స్కూల్ పర్మిషన్​ రద్దు చేయాలని ధర్నా

నిజామాబాద్,  వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా హాలిడే రోజు క్లాస్​లు నిర్వహిస్తున్న  శ్రీ చైతన్య స్కూల్​పర్మిషన్​ రద్దు చేయాలని స్టూడెంట్స్​ సంఘాలు డిమాండ్​ చేశాయి. జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య స్కూల్​ఎదుట శనివారం  ఎన్ఎస్​యూఐ, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, జీవీఎస్, ఏఐఎస్​బీ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. అనంతరం స్కూల్​లో వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ నాసిరకం ఫుడ్​ పెడుతున్నారని ఆరోపించారు.  స్కూల్ హాస్టల్ లో రైస్ బాగాలేదని, కుళ్లిన కూరగాయల తో  భోజనం పెడుతున్నారని విద్యార్థి సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్, ఫుడ్ ఇన్​స్పెక్టర్​కు ఫోన్ లో  ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో టీవీయువీ రాష్ట్ర కో ఆర్డినేటర్ రమావత్ లాల్ సింగ్, ఏఐఎస్బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, ఎన్ఎస్​యూఐ జిల్లా ప్రెసిడెంట్​ వేణు రాజ్, జీవిఎస్​జిల్లా అధ్యక్షుడు జైత్రాం రాథోడ్ , రాహుల్ ,చందు పాల్గొన్నారు

ఘనంగా మోడీ బర్త్​డే 

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​లో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మందరంలో ప్రత్యేక పూజలు చేసి మోడీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మొక్కుకున్నారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్​ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ అనిల్​, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజు, దళిత మోర్చా పార్లమెంటు కన్వీనర్ రాజారాం, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, టౌన్​ ప్రెసిడెంట్​ ప్రశాంత్ పాల్గొన్నారు.
 

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డిలో  బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార,  నియోజకవర్గ ఇన్​చార్జి వెంకటరమణరెడ్డి మాట్లాడారు.  జిల్లా హస్పిటల్​లో  పార్టీ స్టేట్​ కార్యవర్గ సభ్యుడు  నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ,  రక్తదాన శిబిరం జరిగింది. కార్యక్రమంలో కిసాన్​ మోర్చా స్టేట్​ కార్యవర్గ మెంబర్​ బాల్​కిషన్​,  లీడర్లు సుధాకర్​, రమేశ్​ పాల్గొన్నారు.

తెలంగాణలో కేసీఆర్ ​కుటుంబమే అభివృద్ధి
మజీ మంత్రి షబ్బీర్​ ఆలీ

భిక్కనూరు, వెలుగు: కాళేశ్వరం నీరు కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, కేసీఆర్​ ఫాంహౌస్​ చుట్టే ఉన్నాయని, మరి మిగతా ప్రాంతాలను ఎందుకు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్​ను కాంగ్రెస్​నేత, మాజీ మంత్రి మహ్మద్​ షబ్బీర్​ఆలీ ప్రశ్నించారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లి, కాచాపూర్​, లక్ష్మీదేవునిపల్లి, జంగంపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం వస్తే ప్రజలు అభివృద్ది చెందుతారని సోనియమ్మ తెలంగాణ ఇస్తే.. సీఎం కేసీఆర్​ కుంటుంబం మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగం పెంచి కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్​ రాష్ట్రానికి ముఖ్యమంత్రా.. లేక ఒక్క చింతమడకకేనా అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డివిరుస్తున్నాయని ఆరోపిచారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్​జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్, మండలాధ్యక్షుడు భీమ్​రెడ్డి, టీపీసీసీ కార్యవర్గ సభ్యుడు ఇంద్రకరణ్​రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్​రెడ్డి, మంద నర్సింలు, నర్సింలు యాదవ్, రమేశ్, చింటు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

కామారెడ్డి , వెలుగు: సెప్టెంబర్​ 17ను పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇందిరా చౌక్​వద్ద మాజీ మంత్రి షబ్బీర్​అలీ జెండావిష్కరించారు.  డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​రావు, లీడర్లు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య 

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: నిజామాబాద్​శివారులోని అశోక్ సాగర్ లో శనివారం గుర్తుతెలియని మహిళ(27) ఆత్మహత్య చేసుకుంది. మృతదేహం వద్ద  నలుపు రంగు బర్కా, పింక్ కలర్ స్లిప్పర్స్ ఉన్నాయి. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే ఆరో టౌన్  పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సాయినాథ్ సూచించారు.

ఈ నెల 19న బీడీఎస్ఎఫ్​ ప్లీనరీ

కామారెడ్డి, వెలుగు: బీడీఎస్ఎఫ్​( బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య) కామారెడ్డి జిల్లా ప్లీనరీ  ఈనెల 19న  జిల్లా కేంద్రంలో జరుగుతుందని ఆ సంఘం జనరల్ సెక్రటరీ డి.నరేందర్,  వైస్​ ప్రెసిడెంట్​ కె. ప్రవీన్​తెలిపారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలపై రివ్యూతో పాటు, భవిష్యత్​లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. ప్లీనరీకి చీఫ్​గెస్ట్​గా సీపీయూఎస్​ఐ  స్టేట్​సెక్రటరీ కట్ల భూమన్న,  బీడీఎస్ఎఫ్​ స్టేట్​ ప్రెసిడెంట్​ఆజాద్​,  బహుజన ఐక్య వేదిక జిల్లా కన్వీనర్​ క్యాతం సిద్దిరాములు హాజరవుతారన్నారు.

20 నుంచి పీడీఎస్​యూ రాజకీయ శిక్షణ తరగతులు

నిజామాబాద్ టౌన్, వెలుగు: పీడీఎస్​యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఈనెల 20 నుంచి 22 వరకు నిజామాబాద్​లో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కల్పన, ప్రధాన కార్యదర్శి నరేందర్ తెలిపారు.  శనివారం నగరంలో పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ క్లాసులకు ఓయూ ప్రొఫెసర్ కాసిం, ప్రజాకవి జయరాజు, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి మనోహర రాజు, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు రమ,  పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.నాగేశ్వరరావు, బి.రాము పాల్గొంటారని తెలిపారు.

కామారెడ్డి చికాగో సిటీ  లెక్క కనిపిస్తోంది..!
స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి

కామారెడ్డి , వెలుగు: కామారెడ్డి టౌన్​ను చూస్తూంటే అమెరికాలోని చికాగో సిటీ లెక్క కనిపిస్తోందని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు.  శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ లో జాతీయ జెండా అవిష్కరించారు. అనంతరం మీటింగ్​లో స్టేట్​ అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా  స్పీకర్​ మాట్లాడుతూ  ము న్సిపాలిటీ ఫండ్స్​, సీఎం ఇచ్చిన ఎస్డీఎఫ్​ ఫండ్స్​తో కామారెడ్డిలో అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.  సెంట్రల్​ లైటింగ్, చెట్లను చూస్తుంటే అమెరికాలోని చికాగో సిటీ లెక్క కనిపిస్తోందన్నారు. టీఆర్ఎస్​ప్రభుత్వంలో కామారెడ్డితో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. చైర్​పర్సన్​ నిట్టు జాహ్నవి చక్కగా పనిచేస్తున్నారన్నారు.  బాన్స్​వాడ, ఎల్లారెడ్డి టౌన్లలో కూడా అభివృద్ధి జరుగుతోందన్నారు.