
టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు తేలింది. 31 ఏళ్ల సిరాజ్ ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ను ఉల్లంఘించడంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించబడింది. వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే బెన్ డకెట్ వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో మిడ్ ఆన్ లో షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డకెట్ వికెట్ పడిన తర్వాత తన సెలెబ్రేషన్ లో భాగంగా సిరాజ్ హద్దు మీరి ప్రవర్తించినట్టు ఐసీసీ తెలిపింది.
సిరాజ్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘించాడు. ఈ రూల్ ప్రకారం.. "అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో బ్యాట్స్‌మన్ ఔట్ అయినప్పుడు అతన్ని అవమానించేలా లేదా దూకుడుగా సైగలు చేయకూడదు". క్రమశిక్షణా లేని కారణంగా ఫైన్ తో పాటు సిరాజ్ కు ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వడం జరిగింది. 24 నెలల్లో సిరాజ్ కు ఇది రెండో డీ మెరిట్ పాయింట్. ఈ ఏడాది ప్రారంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో సిరాజ్ డీమెరిట్ పాయింట్ అందుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో సిరాజ్ డకెట్ తో పాటు పోప్ వికెట్ తీసుకొని టీమిండియాకు శుభారంభం ఇచ్చాడు.
ALSO READ : IND vs ENG 2025: గంటలో టీమిండియాను ఆలౌట్ చేస్తాం.. లార్డ్స్ టెస్ట్ మాదే: ఇంగ్లాండ్ కోచ్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే వికెట్ నష్టపోకుండా 2 పరుగులతో నాలుగో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో మన బౌలర్లు చెలరేగడంతో కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా ముందు 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచగలిగింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యమే అయినా నాలుగో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసి కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (33 బ్యాటింగ్) ఇంగ్లిష్ బౌలర్లకు ఎదురు నిలిచినా.. యశస్వి జైస్వాల్ (0), కెప్టెన్ గిల్ (6), కరుణ్ నాయర్ (14) ఫెయిలయ్యారు. చేతిలో ఇంకో 6 వికెట్లు ఉండగా చివరి రోజు ఇండియాకు మరో 135 రన్స్ కావాలి.
Mohammed Siraj has been fined 15% of his match fee and handed one demerit point for breaching the ICC Code of Conduct 👀 pic.twitter.com/C46sgUFMCr
— ESPNcricinfo (@ESPNcricinfo) July 14, 2025