పండుగ స్పెషల్.. వినాయక చవితి కథ చెప్పిన మోహన్‌ బాబు

పండుగ స్పెషల్.. వినాయక చవితి కథ చెప్పిన మోహన్‌ బాబు

హైదరాబాద్: విఘ్నాలను తొలగించే వినాయకుడి కథను విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనదైన స్టయిల్‌లో చెప్పారు. శనివారం వినాయక చవితి కావడంతో వినాయక చవితి కథను మోహన్ బాబు తన గొంతులో వినిపించారు. మంచు విష్ణు దీన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

‘నేను చదవడం, వినడం దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నాకు ఇష్టమైన పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో నేను మొదటిగా ఇష్టపడేది వినాయక చవితి. ఏటా మా కుటుంబ సభ్యులతోపాటు కొందరు సన్నిహితులను ఇంటికి పిలిచి, నేనే స్వయంగా పుస్తకంలో ఉన్న మంత్రాలను చదివి, కథ వినిపించడం అలవాటు. ఆ అలవాటును మీ అందరికీ వినిపించాల్సిందిగా నా పెద్ద కుమారుడు విష్ణు వర్థన్ బాబు నన్ను కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా విఘ్నేశ్వరుడి కథను మీకు వినిపిస్తున్నా’ అంటూ మోహన్ బాబు తనదైన విలక్షణ శైలిలో కథ చెప్పారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.