ఎంతో మంది బలిదానాలతో భవనాన్ని నిర్మించుకున్నం

ఎంతో మంది బలిదానాలతో భవనాన్ని నిర్మించుకున్నం
  • ఎంతో మంది బలిదానాలతో భవనాన్ని నిర్మించుకున్నం
  • RSS కార్యకర్త అంటే హేళన చేసేవారు

హైదరాబాద్: తెలంగాణ విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే హేళన చేసేవారు... కాని ఇప్పుడు ఆ పరిషత్ నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. గురువారం హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన..  ఏబీవీపీ కార్యకర్తలు ఎంతో కష్టపడి సొంత భవనాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. దీనికోసం కార్యకర్తలు ఎంతో మంది బలిదానాలు చేశారన్నారు. రాజుల పేర్లు వేయిఏళ్లు గుర్తుంచుకుంటారు కానీ.. తండ్రి వ్యాఖ్య పరిపాలన చేసిన వారిని ఎనిమిది వేల ఏళ్లు అయినా ప్రజలు మర్చిపోలేదని చెప్పారు.  మనుషుల జీవితంలో రాముడు పరివర్తన తీసుకొచ్చారని.. యూపీలో ఇప్పటికీ కొన్ని మైళ్ల బాటలో ఎవరూ నడవరని తెలిపారు. ఎందుకంటే సీత పాదయాత్ర చేసే సమయంలో కాల్లనుంచి రక్తం వచ్చిందని.. అందుకే ఆ ప్రాంతంలో వ్యవసాయం చేయరని చెప్పారు. రాజనీతిలో విజయం సాధించే వారిపై వ్యతిరేఖులు అంతే స్థాయిలో పెరుగుతారన్నారు. వందసార్లు అబద్ధాలు చెబితే అది నిజం అవుతుందంటారు కానీ.. మన దేశంలో మాత్రం అది నిజం కాదని చెప్పారు. దేశం సత్యమేవ జయతే నినాదాన్ని నమ్ముతుందన్న మోహన్ భగవత్.. మాకు ఎలాంటి మెంటర్ లేడు... చెప్పేవాడు లేడు అయినా మాకు అనుభవం ఉందన్నారు. మనం సొంతంగానే ఎదిగాం.. కార్యకర్త సత్తాతో నిలబడ్డామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు.