ప్రేమ తిరస్కరించిందని.. పోర్న్​​సైట్‌లో ఫొటోలు, ఫోన్ నెంబర్

ప్రేమ తిరస్కరించిందని.. పోర్న్​​సైట్‌లో ఫొటోలు, ఫోన్ నెంబర్

గచ్చిబౌలి, వెలుగు :  ప్రేమను తిరస్కరించిందని యువతి ఫొటోలు,  ఫోన్​నంబర్ ను  పోర్న్​సైట్​లో పెట్టాడు. ఆపై ఆమె వాట్సప్​కు అసభ్యంగా మెసేజ్​లు పంపుతూ వేధిస్తున్న  ముంబైకి చెందిన నిందితుడిని సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈస్ట్​ ముంబై గోరెగావ్​జయప్రకాశ్​ నగర్​కు చెందిన అభిషేక్​ మోహన్​ కీర్తికర్​(42) అక్కడే ఓ కంపెనీలో మార్కెటింగ్​ ఎంప్లాయ్. అదే కంపెనీలో హైదరాబాద్​కు చెందిన యువతితో ఐటీ ఎంప్లాయ్ గా జాబ్ చేస్తుండగా అభిషేక్​తో పరిచయమైంది.

కొద్ది రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని అభిషేక్​ చెప్పడంతో ఆమె రిజెక్ట్​ చేసింది. దీంతో ఆమెపై పగ పెంచుకుని  వేధింపులకు పాల్పడుతుండగా.. భరించలేక యువతి స్థానిక పీఎస్ లో కంప్లయింట్ చేసింది. అనంతరం ఆమె హైదరాబాద్​కు వచ్చి హైటెక్ ​సిటీలో సాఫ్ట్​వేర్​ జాబ్ లో చేరింది. అయినా అతడు వదలకుండా..  ఆమె ఫొటోలను, ఫోన్​నంబర్ ను  పోర్న్​ వెబ్​సైట్​లో పెట్టాడు. ఆపై గుర్తు తెలియని ఫోన్​ నంబర్ల నుంచి యువతి వాట్సప్ కు అసభ్యంగా మెసేజ్​పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో యువతి గత ఫిబ్రవరిలో గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి ముంబైలో అభిషేక్ ను అరెస్ట్​ చేశారు. నిందితుడిని ట్రాన్సిట్​ వారెంట్​పై సైబరాబాద్​ పోలీసులు సిటీకి తీసుకువచ్చి  సోమవారం కూకట్​పల్లి కోర్టులో హాజరు పరిచారు.