కన్నప్ప కామిక్ బుక్

కన్నప్ప కామిక్ బుక్

మంచు విష్ణు హీరోగా ‘మహాభారతం’ సీరియల్‌‌‌‌ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మోహన్ లాల్, ప్రభాస్, శరత్‌‌‌‌కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. తాజాగా  మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం

 ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని  లాంచ్ చేశారు.  ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. తిరుపతిలోని తమ యూనివర్సిటీలో జరిగిన మోహన్ బాబు బర్త్‌‌‌‌డే వేడుకలకు మోహన్ లాల్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ ‘యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలని అనుకున్నా.

మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ప్రారంభం అని భావిస్తున్నా. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటున్నా’ అని అన్నాడు