
ఈ ఏడాది ఇప్పటికే అబ్రహం ఓజ్లర్, భ్రమయుగం, టర్బో చిత్రాలతో ఆకట్టుకున్న మలయాళ స్టార్ మమ్ముట్టి.. త్వరలో ‘బజూకా’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. డీనో డెన్నిస్ దీనికి దర్శకుడు. పంద్రాగస్టు సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఇదొక యాక్షన్ గేమ్ థ్రిల్లర్. ఇందులో మమ్ముట్టి పాత్ర ఏమిటో రివీల్ చేయనప్పటికీ పోనీ టెయిల్‌తో వింటేజ్ కారులో నుంచి దిగుతూ స్టైలిష్‌గా కనిపించారు.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన గౌతమ్ మీనన్... ‘ఇది మంచి, చెడుల మధ్య జరిగే ఆట.. ఒక్కరితో మొదలై వంద మందితో ముగుస్తుంది..’ అని చెప్పిన డైలాగ్ ఆసక్తి రేపుతోంది. జగదీశ్, సిద్ధార్థ్ భరతన్, సన్నీ వేన్, షైన్ టామ్ చాకో, ఐశ్వర్య మీనన్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.