OperationSindoor: మా బలమైన సంకల్పానికి చిహ్నం ‘సిందూర్‌’.. హీరో మోహన్ లాల్ ఆసక్తికర పోస్ట్

OperationSindoor: మా బలమైన సంకల్పానికి చిహ్నం ‘సిందూర్‌’.. హీరో మోహన్ లాల్ ఆసక్తికర పోస్ట్

పహల్గాం​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్​ సిందూర్​ (OperationSindoor) చేపట్టింది. పాకిస్థాన్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది.

మే 7న తెల్లవారుజామున దాదాపు 25 నిమిషాల పాటు పాకిస్తాన్, పీవోకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మిసైళ్లతో దాడులు చేసి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సైనం జరిపిన ఆపరేషన్​ సిందూర్పై సినీ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా తమ గళాన్ని విప్పుతున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

‘‘మేము సిందూరాన్ని ఒక సంప్రదాయంగా మాత్రమే కాకుండా, మా అచంచలమైన సంకల్పానికి చిహ్నంగా కూడా ఉపయోగిస్తాం. మీరు ఎన్ని సవాళ్లు విసిరినా.. అంతకు వందరెట్లు నిర్భయంగా, గతం కంటే బలంగా వస్తాం. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం మరియు BSFలోని ప్రతి ధైర్యవంతుడి హృదయానికి వందనం. మీ ధైర్యం మా గర్వాన్ని పెంచుతుంది. జై హింద్! #ఆపరేషన్ సిందూర్’’అంటూ మోహన్ లాల్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇప్పుడీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మోహన్ లాల్ మన భారత సైన్యంలో పదాతి దళంలో కీలకంగా పనిచేస్తున్నారు. 2009లో మోహన్ లాల్కు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రదానం చేశారు. గతేడాది వయనాడ్ బాధిత ప్రాంతాలకు ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వెళ్లి, బాధితులను పరామర్శించారు.

►ALSO READ | దేశభద్రతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కేసు పెట్టాల్సిందే: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

భారత సైన్యం జరిపిన ఈ దాడుల్లో జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదులుఈ దాడుల్లో మరణించారని ఉన్నత వర్గాలు తెలిపాయి.

ఆపరేషన్ సిందూర్ ఆ పేరే ఎందుకు? 

పహెల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఉగ్రవాదులు వారిని అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ మరణించాడు.

అతడి పెళ్లి జరిగిన కేవలం ఐదు రోజులకే టెర్రరిస్టులు చంపేశారు. భర్తవినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫొటో దేశం మొత్తాన్ని కదిలించింది.

ఈ ఉగ్రదాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే భారత్ 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్పై దాడి చేసినట్లు తెలుస్తోంది.