DIESIRAE: మోహన్ లాల్ కుమారుడి మూవీకి సెన్సార్ ‘A’ సర్టిఫికెట్.. తెలుగులో మిస్టరీ థ్రిల్లర్‌ రిలీజ్ ఎప్పుడంటే?

DIESIRAE: మోహన్ లాల్ కుమారుడి మూవీకి సెన్సార్ ‘A’ సర్టిఫికెట్.. తెలుగులో మిస్టరీ థ్రిల్లర్‌ రిలీజ్ ఎప్పుడంటే?

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొడుకు ప్రణవ్‌‌ హీరోగా నటించిన చిత్రం ‘డియాస్‌‌ ఇరాయ్‌‌’ (Dies Irae). మోహన్‌ లాల్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. భూత కాలం, మమ్ముట్టి ‘భ్రమ యుగం’ లాంటి చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సదాశివన్ దీనికి దర్శకుడు. చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందించాడు.

ఇదొక మిస్టరీ హారర్ థ్రిల్లర్‌‌‌‌. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హార్రర్, క్రైమ్ అంశాలతో సినిమాపై ఉత్కంఠ రేపుతోంది. ఇందులో భాగంగా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ స్రవంతి మూవీస్‌‌ సంస్థ విడుదల చేస్తోంది. మలయాళ, తమిళ భాషల్లో ఈనెల 31న విడుదల కానుంది. నవంబర్‌‌‌‌ ఫస్ట్ వీక్‌‌లో తెలుగు వెర్షన్‌‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. 

‘హృదయం’ చిత్రంతో యూత్‌‌ను ఆకట్టుకున్న ప్రణవ్‌‌ మోహన్‌‌ లాల్.. సెలక్టివ్‌‌గా సినిమాలు చేస్తున్నాడు. ప్రణవ్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో హారర్ థ్రిల్లర్‌తో ఆడియన్స్ ను అలరించడానికి వస్తున్నారు ప్రణవ్. అయితే, మలయాళ చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లో దక్కుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్‌‌ చెబుతున్నారు.

ఇటీవలే, మలయాళం నుంచి రిలీజైన 'ప్రేమలు', '2018', 'మంజుమ్మెల్ బాయ్స్', 'టూరిస్ట్ ఫ్యామిలీ',  'కొత్త లోక' వంటి మూవీస్ తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచాయి, ఇపుడు ‘డియాస్‌‌ ఇరాయ్‌‌’ ఎలాంటి టాక్ సొంతం చేసుకోనుందో చూడాలి తెలియాల్సి ఉంది. 

గతేడాది డైరెక్టర్ రాహుల్ సదాశివన్.. భ్రమ యుగం మూవీతో సూపర్ హిట్ కొట్టాడు. హారర్ థ్రిల్లర్‌‌‌‌ జానర్‌‌‌‌లో కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో భ్రమ యుగం ఆసక్తి పెంచేలా తీశాడు. మాయ యుగంలోని ఒక గాయకుడి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలే ఈ సినిమా కథ. ఇందులో ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తించేలా తీసి సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు మోహన్ లాల్ కొడుకుతో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నారా చూడాలి!

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే..  ‘A’ సర్టిఫికేట్ జారీ చేయడం వల్ల ఈ సినిమాను చిన్నపిల్లలు చూడకూడదు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను థియేటర్స్ యాజమాన్యం లోపలికి అనుమతించదు. ముందే ఈ విషయాన్ని గ్రహించి సినిమాకు వెళ్లేలా చూసుకోండి.