Kannappa: విష్ణు కన్నప్ప కొత్త అప్డేట్.. మోహన్ లాల్ కిరాత క్యారెక్టర్ గ్లింప్స్

Kannappa: విష్ణు కన్నప్ప కొత్త అప్డేట్.. మోహన్ లాల్ కిరాత క్యారెక్టర్ గ్లింప్స్

నటుడు మోహన్ లాల్ పుట్టినరోజు (మే21) సందర్భంగా కన్నప్ప టీమ్ అప్డేట్ ఇచ్చింది. మోహన్ లాల్ కన్నప్ప మూవీలో కిరాత పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్ర బృందం ఒక అద్భుతమైన స్పెషల్ గ్లింప్స్ను విడుదల చేసింది.

ఈ పాన్ఇండియన్ ప్రాజెక్ట్ గ్లింప్స్లో మోహన్ లాల్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. విష్ణు మంచు హీరోగా నటించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మొదటి టీజర్కు నెగెటివ్ టాక్ రాగా.. సెకండ్ టీజర్కు పాసిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. విష్ణు నటన, విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తిన్నడు పాత్రలో మంచు విష్ణు కనిపించాడు. తన వారి కోసం ఎంతటి వారినైనా ఎదిరించే వాడిగా విష్ణు సెకండ్ టీజర్లో ఆకట్టుకున్నాడు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.