త్యాగాలను తల్చుకుంటూ బీబీ కా ఆలం ఊరేగింపు

త్యాగాలను  తల్చుకుంటూ   బీబీ కా ఆలం ఊరేగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు ఆదివారం భారీ జన సందోహం మధ్య సాగింది. డబీర్​పుర నుంచి ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, అలిజ కోట్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్,  మీర్ చౌక్, పురానీ హావేలి, దారుల్​ షిఫా, కాలి ఖబర్ మీదుగా చాదర్​ఘాట్​వరకు సాగింది. బీబీ కా ఆలంను అంబారీపై ఊరేగించారు. 

త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం సందర్భంగా సంతాప దినాల్లో భాగంగా షియా ముస్లింలు నల్లటి దుస్తులు ధరించి కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాలను గాయపర్చుకుని  రక్తం చిందించారు. ఊరేగింపు సందర్భంగా పాతబస్తీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపు జరిగిన  అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌‌‌‌ ఆంక్షలు విధించారు. చార్మినార్ వద్ద  సీపీ సీవీ ఆనంద్, అధికారులు దట్టీలు సమర్పించారు.