ఫాం హౌస్ కేసు: పీసీ యాక్ట్ పై హైకోర్టులో వాదనలు.. ఏసీబీ విచారించాలన్న పిటిషనర్

ఫాం హౌస్ కేసు: పీసీ యాక్ట్ పై హైకోర్టులో వాదనలు.. ఏసీబీ విచారించాలన్న పిటిషనర్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ  జరిగింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన పీసీ  యాక్ట్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పంచనామా పంచెస్ పై అభ్యంతర వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై న్యాయవాది జె.ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు.  Pc యాక్ట్ లోని Go268 ప్రకారం సిట్ విచారణ చేయడానికి  వీల్లేదని న్యాయవాది తెలిపారు. ఘటన జరిగిన తరువాత ఇన్ని రోజులకు 164 సీఆర్పీసీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది తప్పు పట్టారు.

ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా పీసీ యాక్ట్ కింద ఏసీబీ విచారణ చేయాలన్నారు. అవినీతి నిరోధక చట్టం2002  కింద నమోదైన కేసులన్నీ ఏసీబీ పరిధిలోకి వస్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దీనికి సంబంధించిన జీవో కూడా ఉందని గుర్తు చేశారు. జీవో ప్రకారం పీసీ యాక్ట్ కేసులన్నీ ఏసీబీ పరిధిలోకి వస్తాయన్నారు. దీంతో ఈ  అంశంపై ఏజీ వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.