ఫాంహౌస్​ కేసు: హైకోర్టులో ‘సిట్’  కౌంటర్​

ఫాంహౌస్​ కేసు: హైకోర్టులో ‘సిట్’  కౌంటర్​

మొయినాబాద్​ ఫాం హౌస్​ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లపై  సిట్ అధికారులు హైకోర్టులో కౌంటర్ సమర్పించారు. సిట్ సమర్పించిన కౌంటర్ లో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఇందులో అడ్వకేట్​ ప్రతాప్ గౌడ్  గురించి కూడా ప్రస్తావన ఉంది. ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన నిందితుల జాబితాలో ప్రతాప్  లేడన్న సిట్​ అధికారులు.. కౌంటర్​ లో మాత్రం ఆయన పేరును చేర్చడం గమనార్హం. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయాల్సిన అవసరం ఉందని సిట్​ పేర్కొంది.

అనుమానితులకు 41a  crpc కింద నోటీసులు జారీ చేసి విచారణ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఆడియో టేప్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన వ్యక్తులపై దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపింది. 41 a crpc నోటీసులు అందుకున్న వారి జాబితాను కౌంటర్ లో సిట్​ అధికారులు ప్రస్తావించారు . నిందితులు నంద కుమార్, రామచంద్ర భారతి, సింహయాజిల మధ్య జరిగిన సంభాషణ ఆధారాలను కౌంటర్ లో పేర్కొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  బీఎల్ సంతోష్ వాట్సాప్ చాటింగ్ వివరాలను కూడా సమర్పించారు. ముగ్గురి కాల్ డేటా వివరాలను సైతం కౌంటర్ లో పొందుపరిచారు.