
హైదరాబాద్: ప్రముఖ షార్ట్ వీడియోస్ యాప్ మోజ్.. తమ బ్రాండ్ నూతన ప్రచారం ‘స్వైప్ అప్ విత్ మోజ్’ను ఆరంభించింది. వినోద రంగంలో తమ స్థానాన్ని బ్రాండ్ ద్వారా బలోపేతం చేసుకునేందుకు విజయ్ దేవరకొండ తో పాటుగా బాలీవుడ్ నటి అనన్య పాండేలతో భాగస్వామ్యం చేసుకుంది. వీరు యాప్ యొక్క బ్రాండ్ వీడియోలపై కనిపించడంతో పాటుగా మోజ్‌పై క్రియేటర్లుగా కూడా కనిపించనున్నారు. దక్షిణ భారతదేశంలో బ్రాండ్ ఉనికిని మరింతగా పెంపొందించేందుకు విజయ్ దేవరకొండ ఉపయోగపడితే, హిందీ మాట్లాడే ప్రాంతాలలో అనన్య పాండే వల్ల వేగంగా విస్తరించాలని మోజ్ ప్లాన్ చేసుకుంది. నిత్యం గొడవలతో చికాకు పొందిన వారు మోజ్‌పై స్వైప్ చేయడంతో పాటుగా తమ తల్లిదండ్రులు మరియు బంధువులు ఆహ్లాదకరమైన సంగీతానికి నృత్యం చేస్తున్నట్లుగా ఊహించుకునేలా రూపొందించిన యాడ్ ద్వారా వినోదం కోసం వెతుకుతున్న వారిని చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది మోజ్.