మోనోక్లోనల్ థెరపీతో కరోనాకు చెక్‌.. 100% ఫలితాలు!

మోనోక్లోనల్ థెరపీతో కరోనాకు చెక్‌.. 100% ఫలితాలు!

కరోనాకు వైద్యం లేదు.. అన్న డాక్టర్లే ఇప్పుడు కొత్త ప్రయోగాలు చేసి విజయం సాధిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ వంద శాతం ఫలితాలు ఇస్తోందని స్టడీలో తేలింది. విదేశాల్లోనూ కరోనాకు చెక్ పెట్టేందుకు.. ఈ థెరపీనే ప్రస్తుతం వాడుతున్నారు. ఇంతకీ మోనోక్లోనల్ యాంటీ బాడీ థెరపీ కరోనాను ఎలా ఎదుర్కొంటుంది? ఏ వయసు వారికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది? అన్న విషయాలు తెలుసుకుందాం..

కరోనాకు ట్రీట్మెంట్ లేదు... కరోనా లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడమే తప్ప.. ప్రత్యేక వైద్యమే లేదన్నారు డాక్టర్లు. కానీ.. కొత్త కొత్త ప్రయోగాలు చేసి.. కరోనాకు ట్రీట్మెంట్ కనుక్కుంటున్నారు డాక్టర్లు. ఎన్ని రకాల వైద్యం వచ్చినా.. మోనోక్లోనల్ యాంటీ బాడీ థెరపీ మంచి ఫలితాలు ఇస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. CCMB, AIG జాయింట్ గా  చేసిన స్టడీలో.... ఈ థెరీపీ వ్యాధి తీవ్రతను, మరణాలను వంద శాతం తగ్గించిందని తేలింది. 285 మంది కరోనా వచ్చిన 7 రోజుల లోపు పేషంట్స్ ను  సెలక్ట్ చేసి... అందులో 208 మందికి మోనోక్లోనల్ యాంటీ బాడీ థెరపీ, మిగతా 77 మందికి సాధారణ ట్రీట్మెంట్ ఇచ్చారు. మోనోక్లోనల్ యాంటీబాడీలు తీస్కున్న వారిలో 78 శాతం మందికి 7 రోజుల తరువాత RTPCR నెగిటివ్ వచ్చింది. సాధారణ ట్రీట్మెంట్ తీస్కున్నవారిలో 50 శాతం మందికి పాజిటివ్ వచ్చింది.

సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ తో అత్యధికంగా కరోనా బారిన పడ్డారు రోగులు. వీళ్ళకీ ట్రీట్మెంట్ బాగా పని చేసిందని, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే తీస్కున్నారు. ఈ ట్రీట్మెంట్ కరోనా వచ్చిన ప్రతి రోగికి అవసరం లేదు. 60 యేళ్లు దాటి మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం లాంటి ధీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి ఈ చికిత్స అందిస్తున్నారు. 60 యేళ్ల లోపు ఉన్నవారిలో కూడా కోమార్బిడిటీ కండిషన్ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీస్కోవచ్చు. కోవిడ్ వచ్చిన 7 రోజుల లోపే.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ అందిస్తే.. శరీరంలోకి చేరిన యాంటీబాడీలు కరోనా స్ప్రైక్ ప్రోటీన్ పై దాడి చేసి, వైరస్ లోడ్ ను తగ్గిస్తాయి. దాంతో హాస్పిటల్ లో అడ్మిట్ అవసరం లేదని స్టడీలో తేలింది.

ప్రస్తుతం రెండు రకాల మెడిషన్ తో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్ టెయిల్ ను అందిస్తున్నారు. ఒక డోస్ కు 65 వేల రూపాయిల ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. రెమిడిస్విర్ లాంటి మెడిసన్ కంటే.. ఈ థెరపీ మంచి ఫలితాలను ఇచ్చిందని స్టడీలో తేలింది.

మరిన్ని వార్తల కోసం..

ఆది శంకరుడు సాక్షాత్తు శివ స్వరూపం: ప్రధాని మోడీ

ఉప్పల్‌లో సర్కారు భూముల వేలం.. టార్గెట్ వెయ్యి కోట్లు

అంతర్జాతీయ క్రికెట్‎కు వీడ్కోలు ప్రకటించిన బ్రావో