ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే

ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దే

ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  భారీ సంఖ్యలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. చార్‌‌ ధామ్‌ల మధ్య రోడ్డు కనెక్టివిటీతో పాటు హేమ్‌కుండ్ సాహిబ్‌ సమీపంలో భక్తుల కోసం రోప్‌ వే కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. గత వందేళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో రానున్న పదేళ్లలో టూరిస్టులు ఉత్తరాఖండ్‌ను సందర్శించనున్నారని అన్నారు. చార్‌‌ ధామ్‌లలో ఒకటైన కేదార్‌‌నాథ్‌లో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వెళ్లారు. అక్కడ కేదారనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన ఆదిగురు శంకరాచార్యుడి సమాధిని, 12 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో వరదల విధ్వంసం తర్వాత కేదార్‌‌నార్‌‌ను తిరిగి అభివృద్ధి చేయగలమా అన్న సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయని మోడీ అన్నారు. అయితే క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎంతో నమ్మకంతో పనులు పూర్తి చేశామన్నారు. సైనికులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. పునర్నిర్మించిన ఆదిశంకరాచార్యుల సమాధిని ప్రారంభించినప్పుడు ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యాయని చెప్పారు. ఆది శంకరులు సాక్షాత్తు శివ స్వరూపులన్నారు మోడీ.

కేదార్‌‌నాథ్ ఆలయం వెనుక శంకరాచార్య సమాధి ఉంది. 2013లో వరదల్లో ఈ సమాధి దెబ్బతింది. సమాధి పునరుద్ధరన పనులను మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సమాధి దగ్గర 35 టన్నులతో ఆదిశంకరుల విగ్రహం నిర్మించారు. ఇవాళ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తొలుత ఆలయంలో పూజలు చేశారు. కేదారీశ్వరుడికి హారతి ఇచ్చారు. పూజల తర్వాత పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని ప్రారంభించారు. ఆదిశంకరుల విగ్రహాన్ని ఆవిష్కరించి కాసేపు ధ్యానం చేశారు. అలాగే కేదార్ నాథ్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మోడీ. 130 కోట్లతో నిర్మించిన సరస్వతి రిటైనింగ్ వాల్, ఘాట్లు, మందాకిని రిటైనింగ్ వాల్, తీర్థ పురోహిత్ హౌస్ లు, మందాకిని నదిపై నిర్మించిన గరుడ్ చట్టి వంతెనలను ప్రారంభించారు. సుమారు 400 కోట్లతో నిర్మించబోతున్న ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్: టపాసులు కాలుస్తూ గాయపడ్డ 36 మంది చిన్నారులు

చిన్నారి లేఖతో ఆర్టీసీ కదిలొచ్చింది.. గ్రామానికి బస్సొచ్చింది

గోల్డ్ లోన్లకు మస్త్ డిమాండ్.. కారణమేంటంటే..?