గోల్డ్ లోన్లకు మస్త్ డిమాండ్.. కారణమేంటంటే..?

గోల్డ్ లోన్లకు మస్త్ డిమాండ్.. కారణమేంటంటే..?

ఎవరికైనా అర్జెంట్ గా డబ్బులు అవసరమైతే వెంటనే తెలిసిన వాళ్ళ దగ్గర చేబదులు తీసుకుంటారు. అదే లోన్ కి అప్లై చేస్తే చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఒకవేళ ఫైనాన్షియర్ దగ్గర వడ్డీకి పైసల్ తెచ్చుకుంటే ఆర్ధిక భారం తప్పదు. అందుకే చాలామంది గోల్డ్ లోన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రెండేళ్ళలో గోల్డ్ లోన్ డిమాండ్ పెరగడానికి కారణమేంటో చూద్దాం.
 
కరోనా మహమ్మారితో దెబ్బతిన్న పెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో భారత్ రెండో స్ధానంలో ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, లాక్ డౌన్ విధింపుల ప్రభావం అన్ని వర్గాలపై పడింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోడంతో ఆర్థికంగా దెబ్బతిన్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తడటంతో.. అంచనాకు మించి ఖర్చులు అయ్యాయి. కరోనా టైమ్ లో బయట డబ్బులు ఇచ్చేవారు కూడా కరువయ్యారు. లిక్విడ్ క్యాష్ ఎవరి దగ్గరా లేకుండా పోయింది. డబ్బుల విషయంలో ఎవరినీ నమ్మే పరిస్ధితి లేకపోయింది. దాంతో గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఈ రెండేళ్ళలో 25 నుంచి 30 శాతానికి పెరిగినట్టు అంచనా.

బ్యాంకుల పర్సనల్ లోన్ వడ్డీ రేటు 12.75 శాతం నుంచి 19 శాతంగా ఉంటోంది. పర్సనల్ లోన్ రావాలంటే ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ చూస్తారు. కరోనా టైమ్ లో వ్యక్తిగత రుణాల మంజూరును బ్యాంకులు బాగా తగ్గించాయి. దాంతో చాలామంది అత్యవసర సమయంలో ఇంట్లో ఉన్న గోల్డ్ ని పెట్టి లోన్ తీసుకుంటున్నారు. వీటిపై 12శాతం వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు. కరోనా తర్వాత చాలామంది ఆర్ధిక విధానంలో మార్పులు వచ్చినట్లు బిజినెస్ అనాలిస్ట్ లు చెబుతున్నారు. ఇంతకు ముందు ఎంత వడ్డీ అయిన సరే.. అవసరాన్ని బట్టి లోన్ తీసుకునేవాళ్ళు. కానీ ప్రస్తుతం వడ్డీ రేటు ఎలా తగ్గించుకోవచ్చో చూస్తున్నారు. అందుకే ఇంట్లో ఉన్న గోల్డ్ పెట్టి డబ్బులు తెచ్చుకుంటున్నారు.

అన్ని లోన్స్ తో పోలిస్తే అత్యవసర సమయంలో బంగారం రుణాలే బెటర్ అంటున్నారు బిజినెస్ అనలిస్ట్ లు. గోల్డ్ లోన్ తీసుకుంటే ప్రతినెలా ఇంట్రెస్ట్ చెల్లిస్తూ... తొందర్లోనే లోన్ మొత్తం చెల్లించి బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఆ బంగారాన్ని ఆక్షన్ కు పెట్టే  అవకాశాలుంటాయి.  గోల్డ్ లోన్ తీసుకునేప్పుడు బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదంటున్నారు.

కోవిడ్ కారణంగా వచ్చిన మార్పులతో వ్యాపారాలు దెబ్బతినడంతోపాటు... అన్ ఎంఫ్లాయ్ మెంట్ పెరిగింది. దీంతో మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఎమర్జెన్సీ అవసరాలకు గోల్డ్ లోన్స్  తీసుకుంటున్నారు. దాంతో గత రెండేళ్ళుగా గోల్డ్ లోన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది.