వర్షాకాల సమావేశాలపై కసరత్తు

వర్షాకాల సమావేశాలపై కసరత్తు

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దగ్గరపడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. అన్ని పార్టీల కీలక నేతలతో ఈ నెల 17న ఉదయం సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. ఎజెండాపై చర్చ, సమావేశాలు సజావుగా జరగడానికి అన్ని పార్టీల మద్దతును కోరనున్నారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ హాజరుకానున్నారు. కాగా, పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశాన్ని లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా జులై 16న సాయంత్రం ఏర్పాటు చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు 17న సాయంత్రం వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.