జూలై 21నుంచి పార్లమెంట్ సమావేశాలు..ఈసారి 8కొత్త బిల్లులు

జూలై 21నుంచి పార్లమెంట్ సమావేశాలు..ఈసారి 8కొత్త బిల్లులు
  • ఈసారి 8 కొత్త బిల్లులు
  • ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వీటిలో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్‌‌ అండ్ జియో–రెలిక్స్ (ప్రిజర్వేషన్ అండ్ మెయింటెనెన్స్) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ అమెండమెంట్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ అమెండమెంట్ బిల్లు ఉన్నాయి.

వీటితో పాటు మణిపూర్ జీఎస్టీ అమెండమెంట్ బిల్లు, జన్ విశ్వాస్ (అమెండమెంట్ ఆఫ్ ప్రొవిజన్స్) బిల్లు, ఐఐఎం అమెండమెంట్ బిల్లు, ట్యాక్సేషన్ లాస్ అమెండమెంట్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

అలాగే ఇన్‌‌కమ్ ట్యాక్స్ బిల్లు–2025ని ఫిబ్రవరిలో లోక్‌‌సభ సెలెక్ట్ కమిటీకి పంపగా, ఈ సమావేశాల్లో కమిటీ రిపోర్టును ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. రాఖీ పండగ, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12 నుంచి 18 వరకు బ్రేక్ ఉంటుంది. మొత్తం 21 రోజుల పాటు చట్ట సభలు నడవనున్నాయి.