
హైదరాబాద్, వెలుగు : జూన్ 3వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంది. టీఎస్‌డీపీఎస్ డేటా ప్రకారం ఆదివారం అత్యధికంగా భద్రాద్రికొత్తగూడెంలో 41.2డిగ్రీలు, ఖమ్మంలో 40.4, సూర్యాపేటలో 40, నల్లగొండ, వరంగల్ రూరల్‌లలో 39.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.