
సెప్టెంబర్ నెలలో పలు పండుగలతో పాటు.. ఒకే నెలలో చంద్రగ్రహణం... సూర్యగ్రహణం రెండు ఏర్పడబోతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ రోజు .. ఏ గ్రహణం.. ఏ సమయంలో ఏర్పడుతుంది.. భారతదేశంలో కనపడుతుందా.. లేదా.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం సూతకాలం ఎంత సమయం ఉంటుంది.. మొదలగు వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెలలో రెండు గ్రహణాలు ఉంటాయి. వాటిలో ఒకటి సూర్యగ్రహణం, మరొకటి చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి.
మొదటిది సంపూర్ణ చంద్రగ్రహణం ( సెప్టెంబర్ 7) : భాద్రపద మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున .. సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ గ్రహణం రాత్రి 9:58కి మొదలై, సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. గ్రహణ వ్యవధి మొత్తం 3.28 నిమిషాలు. సెప్టెంబర్ 7 రాత్రి 11:42 గంటలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు. సంపూర్ణ చంద్ర గ్రహణం సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26కు ముగుస్తుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది. కనుక సూతక కాలం చెల్లుతుంది. గ్రహణ సమయంలో మంత్రాలను జపించడం, దానధర్మాలు చేస్తే మంచి ఫలితం ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. .
పాక్షిక సూర్య గ్రహణం( సెప్టెంబర్ 21 ): సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 న రాత్రి 10.59 గంటల నుంచి తెల్లవారుజామున 3:23 గంటల వరకు ఏర్పడనుంది. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సూర్య గ్రహణం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ తదితర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్యగ్రహణం సూత కాలం మనకు వర్తించదు. కానీ.. పవిత్ర నదీ స్నానం చేయాలి లేదా గంగాజలంతో కలిపి స్నానం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.